ప్రమాదాలు ...

గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి .. బాసరలో విషాదం

  • హైదరాబాద్ నుంచి బాసర సరస్వతీ మాత దర్శనానికి వెళ్లిన కుటుంబం
  • నదిలో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతు
  • నలుగురి మృతదేహాలు వెలికి తీత.. మరొకరి కోసం గాలింపు

బాసర సరస్వతీ మాత దర్శనానికి వెళ్లిన భక్తులు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో మునిగిపోయారు. స్నానం కోసం నదిలో దిగిన ఐదుగురు గల్లంతయ్యారు. నలుగురి మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది.. మరొకరి కోసం నదిలో గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రం వద్ద ఆదివారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది. నదిలో స్నానానికి దిగిన భక్తులు గల్లంతవడం చూసి అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన నది వద్దకు చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లతో రెస్క్యూ చేపట్టారు. స్థానిక అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు నలుగురి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మరొకరి కోసం ఇంకా గాలిస్తున్నారు. కాగా, మృతులంతా హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ వాసులని, అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు.

Related posts

లోయలో పడ్డ బస్సు.. శ్రీలంకలో 21 మంది దుర్మరణం

Ram Narayana

వైరా మండలం సోమవారం వద్ద కూలిన స్లాబ్ పోస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి…

Ram Narayana

గుజరాత్ లోని ఓ గేమింగ్ జోన్ లో ఘోర అగ్నిప్రమాదం… 35 మంది మృతి..

Ram Narayana