Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజారాబాద్ లో గెలుపే ఎజండాగా బీజేపీ సమావేశం…

హుజారాబాద్ లో గెలుపే ఎజండాగా బీజేపీ సమావేశం
-హాజరైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ ఛుగ్,కిషన్ రెడ్డి
-టీఆర్ఎస్ కుట్ర‌ల‌న్నింటినీ ఎదుర్కొంటాం మంటున్న బండి సంజయ్
-హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు
-కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల‌నుకుంటున్నారు
-ప్రజలంతా సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్నారు

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో త్వ‌ర‌లోనే హుజూరాబాద్ లో ఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. దీనిపై బీజేపీ కార్యాలయంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుగ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్వంలో బీజేపీ నేత‌లు స‌మావేశమ‌య్యారు. హుజురాబాద్ లో అనుసరించాల్సిన వ్యూహాలని గురించి సుదీర్ఘంగా చర్చించారు. టీఆర్ యస్ ఇప్పటికే వివిధ అభివృద్ధి పనుల పేరుతో నియోజకవర్గంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంపై చర్చజరిగింది.

ఇందులో కేంద్ర హోం శాఖ స‌హాయ‌ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘనందనరావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర నేత‌ డీకే అరుణతో పాటు ప‌లువురు పాల్గొన్నారు. పార్టీ హుజూరాబాద్ ఇన్‌చార్జ్‌ల‌కు కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ… హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజ‌యం త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ కుట్ర‌ల‌న్నింటినీ ఎదుర్కొంటామ‌ని తెలిపారు. ఈటల రాజేందర్‌ గెలుపునకు కృషి చేయాలని హుజూరాబాద్‌ ఇన్‌ఛార్జి, మండల ఇన్‌ఛార్జులకు ఆయ‌న సూచించారు.

గెలుపుకోసం టీఆర్ఎస్ పార్టీ నేత‌లు కుట్ర పూరిత ప్రయత్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చుపెట్ట‌యినా స‌రే హుజూరాబాద్‌లో గెలవాల‌ని ప్రయత్నాలు జరుపుతున్నారని ఆయ‌న అన్నారు. టీఆర్ యస్ ఇక్కడ జరిగే ఎన్నికల్లో ఎన్ని అడ్డదార్లు ఉంటె అన్ని తొక్కడానికి సిద్దపడుతుందనే విషయాన్నీ విస్మరించరాదని అన్నారు. సీఎం కేసీఆర్ మోసాలను ప్రజలు గ్రహించారని , తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్నారని టీఆర్ యస్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని ఇది మంచి అవకాశం దీన్ని జారవిడుచుకుంటే ఈ లాంటి అవకాశం మళ్లీ రాదని ఆయ‌న అన్నారు. హుజారాబాద్ లో బీజేపీ గెలుస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ ను ఇంచార్జిలుగా ఉన్నవారు అందజేయాలని ప్రతి ఇంటిని ,ప్రతి వ్యక్తిని టచ్ చేయాలనీ దిశానిర్దేశం చేశారు.

Related posts

కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం పై ఈటల మండిపాటు…

Drukpadam

కాంగ్రెస్ అధినేత్రి సోనియా ను విచారించిన ఈడీ … భగ్గుమన్న కాంగ్రెస్…

Drukpadam

కేసీఆర్ మరికొన్నాళ్లు పాలిస్తే రాష్ట్రం దివాలా తీయడం ఖాయం: నిప్పులు చెరిగిన కిషన్‌రెడ్డి!

Drukpadam

Leave a Comment