Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉత్తమ్ తో రేవంత్ రెడ్డి భేటీ …తనకు సహకారం అందించాలని కోరిన రేవంత్!

 

ఉత్తమ్ తో రేవంత్ రెడ్డి భేటీ …తనకు సహకారం అందించాలని కోరిన రేవంత్
-అందుకు సమ్మతించిన ఉత్తమ్
-రేపు జరిగే పీసీసీ బాధ్యతల స్వీకారానికి రావాలని ఆహ్వానం
-అంగీకరించిన ఉత్తమ్
కేసీఆర్ తీరు తెలంగాణకు అన్యాయం చేసేలా ఉందన్న ఉత్తమ్
ఉమ్మడి ఏపీ ఉన్నప్పటి కంటే జల దోపిడీ ఎక్కువైంది
ఏపీ దోపిడీనీ కేసీఆర్ అడ్డుకోవడం లేదు
కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తలేనన్న ఉత్తమ్

మాజీ పీసీసీ అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో నూతన పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉత్తమ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్ తనకు సహకరించాలని , రేపు గాంధీ భవన్ లో జరిగే బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు . అందుకు ఉత్తమ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం .

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నీటి దోపిడీతో పోలిస్తే… తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన దోపిడీనే ఎక్కువని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న నీటి దోపిడీపై పార్లమెంటులో లేవనెత్తుతానని చెప్పారు. పోతిరెడ్డిపాడు నుంచి 4 నుంచి 8 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ యత్నిస్తుంటే సీఎం కేసీఆర్ అడ్డుకోకుండా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. కేసీఆర్ తీరు తెలంగాణకు అన్యాయం చేసేలా ఉందని విమర్శించారు.

ఇక ఇన్నాళ్లూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించిన సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఉత్తమ్ అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిలో లేకపోయినప్పటికీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తాను అండగా ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తలేనని అన్నారు. పోలీసుల వేధింపులను సైతం ఎదుర్కొని కార్యకర్తలు నిలబడ్డారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని… మళ్లీ పూర్వ వైభవం పొందుతుందని అన్నారు.

నూతన పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డి ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిశారు. రేపు ఆయన గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా భాద్యతలు తీసుకొంటున్నందున ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ఉత్తమ్ ను ఆహ్వానించారు. కొంతమంది కాగ్రెస్ సీనియర్లు రేవంత్ నియామకంపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

రేపు గాంధీ భవన్ లో జరిగే బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరైయ్యందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం .

 

Related posts

సంక్షోభంలో కాంగ్రెస్ .. సోనియా, రాహుల్‌, ప్రియాంక తమ పదవులకు రాజీనామా?

Drukpadam

ఏపీలో రాజకీయ పార్టీపై షర్మిల వ్యాఖ్యలు… మంత్రి బాలినేని స్పందన!

Drukpadam

జగన్, చంద్రబాబు ఇలాగే కొట్టుకుంటూ ఏపీకి అన్యాయం చేస్తారా?: ఉండవల్లి అరుణ్ కుమార్!

Drukpadam

Leave a Comment