Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ చేతుల్లో బందీ అయిన తెలంగాణ విముక్తి చేద్దాం :రేవంత్ రెడ్డి

కేసీఆర్ చేతుల్లో బందీ అయిన తెలంగాణ విముక్తి చేద్దాం :రేవంత్ 
-తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకుందాం
-అందుకోసం రేయింబవుళ్లు కష్టపడదాం
-కరోనా కంటే ప్రమాద కారులు మోడీ ,కేసీఆర్ లు
-వారిని 100 అడుగుల లోతులో గోతిలో పాతిపెట్టాలి

కేసీఆర్ చేతుల్లో బందీ అయిన తెలంగాణ ను విముక్తి చేద్దాం … తెలంగాణ తల్లిని మనం చూడలేదు … తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ఆమె రుణం తీర్చుకుందాం … అందుకోసం రేయింబవుళ్లు కష్టపడదాం అని నూతన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులుగా భాద్యతలు స్వీకరించిన అనంతరం గాంధీ భవన్ ఆవరణలో జరిగిన సభలో రేవంత్ ఉద్యేకపూరితమైన ప్రసంగం చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అని ఆమె రుణం తీర్చుకునేందుకు కార్యకర్తలందరు నిద్రాహారాలు మని పని చేయాలనీ పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా కవి కాళోజి మాటలను ఉటంకించారు. కరోనా కంటే మోడీ , కేసీఆర్ లు చాల ప్రమాదకారులని మండిపడ్డారు. వారిని 100 మీటర్ల గోతిలో పాతిపెట్టాలని మోడీ కేసీఆర్ విధానాలపై ధ్వజమెత్తారు . అనేక మంది ప్రాణత్యాగాలు ఫలితంగా తెలంగాణ ఏర్పడిందిని , విద్యార్థులు యువకుల బలిదానాలు చూడలేక ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ఇచిన తల్లి సోనియా అని ఆమెకు కనీస కృతజ్నత చూపించని కేసీఆర్ నైజాన్ని దుయ్యబట్టారు. ఏ ఉద్దేశం తో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందో అది నెరవేరలేదని అన్నారు. నీటిసమస్య పరిస్కారం కాలేదు. ఉద్యోగాలు లేవు… నిధులు లేవు పైగా అప్పులు రాష్ట్రంగా మరిందని అన్నారు. రాష్ట్రంలో పట్టిన గులాబీ చీడను పారదోలాలి అన్నారు.

సోనియా గాంధీ …జై కాంగ్రెస్ నినాదాలు తప్ప మారె నినాదాలు ఉండరాదు

రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతుండగా జై రేవంత్ రెడ్డి , రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి , సీఎం సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు ఇస్తుండటంతో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. జై సోనియా గాంధీ , జై కాంగ్రెస్ తప్ప మారె నినాదాలు ఇవ్వదని వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగత నినాదాలు మంచిది కాదని కార్యకర్తలకు హితవు పలికారు.

2023 కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంగా పని చేయాలి …ఉత్తమ్ ,భట్టి

ఇప్పటివరకు అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2023 తెలంగాణ లో అధికారమే లక్ష్యంగా పని చేయాలనీ పిలుపు నిచ్చారు. నూతన అధ్యక్షుడు ఇతర ఆఫీస్ బేరర్స్ కు అభినందనలు తెలిపారు . సభకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అధ్యక్షత వహించారు.

అంతకు ముందు రేవంత్ రెడ్డి హాట్టహాసంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన పెద్దమ్మతల్లి గుడికి వెళ్లి పూజలు నిర్వహించారు. తరువాత మజీద్ లో పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీ తో గాంధీ భవన్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి అవుట్ గోయింగ్ ప్రసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ ,సహా ఇంచార్జిలు శ్రీనివాసన్ ,బోసురాజు ల సమక్షంలో భాద్యతలు స్వీకరించారు.

 

 

Related posts

గాంధీ భవన్ కు వాస్తు దోషం ఉందా?అందుకే మార్పులకు శ్రీకారం చుట్టారా??

Drukpadam

క్విట్ ‘ఇండియా’ అంటూ విపక్ష కూటమిపై ప్రధాని మోదీ ఫైర్

Ram Narayana

కేసీఆర్ మంత్రి వర్గంలో సండ్రకు చోటు ఉంటుందా…

Drukpadam

Leave a Comment