తెలంగాణ రాజకీయ వార్తలు ..

మానుకోట గడ్డపై శివాలెత్తిన ఎర్రజెండా ముద్దుబిడ్డ “సాంబశివుడు”…

మానుకోట గడ్డపై శివాలెత్తిన సాంబశివుడు ఎవరో కాదు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు …ఒక పక్క రాష్ట్రంలో అధికార పార్టీతో స్నేహ హస్తం అందిస్తూనే మరో పక్క స్వతంత్ర కార్యాచరణతో పార్టీని ముందుకు తీసుకోని వెళ్ళుతున్నారు …ఆయన శనివారం మహబూబాబాద్ జిల్లా సిపిఐ మహాసభల్లో పాల్గొన్నారు …ఈ సందర్భంగా ఆయన చేసిన ఉపన్యాసం స్ఫూర్తిదాయకంగా యువతను ఉత్సాహ పరిచే విధంగా ఉంది ..ఎర్రజెండా ఎక్కడ ఉందని అంటున్నోళ్లకు సమాధానంగా పేదలు ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుందని ఎవడ్రా ఎర్రజెండాను లేకుండా చేస్తాననేది అంటూ అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు …ప్రపంచంలో ఎర్రజెండా లేకుండా చేస్తానన్న హిట్లర్ వల్లనే కాదు అమిత్ షా ఎంత అంటూ ధ్వజమెత్తారు …అమాయకులైన గిరిజనులను పోలీస్ ల చేత అతికిరాతకంగా చంపించడం ఏమి న్యాయమని ప్రశ్నించారు ….

ప్రజల కోసం పుట్టింది కమ్యూనిస్టులు అలాంటి కమ్యూనిస్టులను లేకుండా చేస్తానని అనడం భ్రమ అవుతుందని అన్నారు …పేదలు ఉన్నత కాలం కమ్యూనిస్టులు ఉంటారని,మనుషులు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుందని ఉద్ఘాటించారు … కమ్యూనిస్టులను లేకుండా చేయడం ఈ భూప్రపంచం మీద ఎవరితరం కాదని తెలుసుకోవాలని హెచ్చరించారు …కమ్యూనిస్ట్ లను పురిటిలోనే చంపాలని చూసిన కంసుని లాంటి బూర్జువాలు, పెత్తందార్లు, కార్పోరేట్ శక్తులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయిన విషయాన్నీ గుర్తు చేశారు . కమ్యూనిజం సజీవం.. శాశ్వతం…శాస్త్రీయం ఎదో గుడ్డిగా వచ్చింది కాదు … ఒక సిద్ధాంతం దానికి హేతు బద్ధత ఉందని పేర్కొన్నారు …

ప్రజలంతా కమ్యూనిస్టులు బ్రతకాలని కోరుకుంటున్నారు ….కానీ అమిత షా మాత్రం కమ్యూనిస్టులను లేకుండా చేస్తానని అంటున్నారు ..నంబాల కేశవరావును అమిత్ షా అన్యాయంగా చంపారు…ఇది అత్యంత దారుణం ..దుర్మార్గం …అధికారం లేకపోతె అమిత షా లు మోడీ లు ఎక్కడ ఉంటారు …కానీ అధికారం ఉన్న లేకున్నా కమ్యూనిస్టు లు ప్రజలకోసం పోరాడుతారని సాంబశివరావు కమ్యూనిస్టుల గొప్పతనాన్ని గురించి చెప్పారు ..

ఎత్తులు -పొత్తులపై ఆయన మాట్లాడుతూ అవి తాత్కాలికం… పొత్తులు ఎత్తుగడలు మాత్రమే…, ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోకుంటే డిమాండ్ లను నెరవేర్చకుంటే తెలంగాణాను దిగ్బందించడానికి వెనుకాడంమని అధికార కాంగ్రెస్ పార్టీకి సైతం చురకలు అంటించారు …తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోం…, పాలకులను ప్రశ్నిస్తూనే ఉంటాం…
మాకు పదవులు మాకు ముఖ్యం కాదు…, మమ్మల్ని, ప్రజల్ని కాదనుకొని బిఆర్ఎస్ ఫాంహౌస్ కు పోయింది.., ప్రజలకు నష్టం చేస్తే రేపు కాంగ్రెస్ గతైనా అంతే అని ప్రతినిధుల హర్షద్వానాల మధ్య తన దైన శైలిలో పాలకుల వైఖరిని తూర్పారబట్టారు ..

ఖమ్మం లో డిసెంబర్-26 న వంద సంవత్సరాల వేడుకను లక్షలాదిమందితో నిర్వహించబోతున్నట్లు తెలిపారు ..సిపిఐ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. 1951 వరకు మేము సాయుధపోరాటం చేశాం …, పరిస్థితులను బట్టి ఆయుధాలను జమ్మిచెట్టు మీద పెట్టాం…, తీసే అవసరం రాకూడదనే కోరుకుంటున్నాం…మావోయిస్టులు కూడా ఆ..దిశగా ఆలోచన చేయండి అని కోరుతున్నానన్నారు .. వేరు వేరుగా ఉన్న ఎర్రజెండాలు అన్ని కలిసే రోజు రావాలి… ఎర్రకోట పై ఎర్రజెండా ఎగరాలని భావోద్యేగా ఉపన్యాసం చేశారు …ఇటీవల కాలంలో ఆయన చేసిన మంచి ఉపన్యాసంగా చెప్పుకుంటున్నారు ..నిజంగా కూనంనేని శివాలెత్తారని స్ఫూర్తిని నింపారని సభకు హాజరైన కామ్రేడ్స్ అంటున్నారు ..

Related posts

బీఆర్ఎస్ నేతల చిట్టాలన్నీ నా దగ్గరున్నాయి.. బయట పెడితే తట్టుకోలేరు: కడియం శ్రీహరి

Ram Narayana

తప్పుడు మాటలు మాట్లాడితే తాటతీస్తా …హీరోయిన్లతో సంబంధాల ఆరోపణలపై కేటీఆర్

Ram Narayana

వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య

Ram Narayana