తెలంగాణ లో పార్టీ పై పవన్ కళ్యాణ్ చేతులెత్తేశారా?
-పార్టీని నడిపేందుకు ఆయన దగ్గర పైసలు లెవా
వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుపై పవన్ కల్యాణ్ స్పందన
పార్టీ ఏర్పాటును స్వాగతిస్తున్నామని వెల్లడి
ఇది ప్రజాస్వామ్యం అని వివరణ
మరిన్ని పార్టీలు రావాలని ఆకాంక్ష
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చలన చిత్రరంగంలో టాప్ హీరో లలో ఒకరు … రాజకీయాలపై కసిగా ఉన్న పవన్ జనసేనను స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలనేది ఆయన కోరిక … 2019 ఎన్నికలలో వామపక్షాలతో పొత్తు , బీఎస్పీ తో దోస్తీ చేగువేరా ఆదర్శం తో ముందుకు సాగారు .ఎన్నికల్లో తాను పోలిచేసిన రెండు సీట్లలో ఓడిపోయారు . ఎన్నికల్లో ఘోరంగా పరాభవం చెందిని పవన్ కళ్యాణ్ బీజేపీ రెండవసారి అధికారంలోకి రావడంతో దానితో దోస్తీ చేస్తున్నారు. గత కొంతకాలం క్రితం తెలంగాణ కూడా పార్టీని నిర్మాణం చేస్తానని చెప్పి సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. కొన్ని పర్యటనలు కూడా చేశారు. కానీ ఎందుకో తెలంగాణ లో పార్టీ నిర్మాణం విషయంలో చేతులెత్తేశారా అనే సందేహాలు కలుగు తున్నాయి. షర్మిల తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టడం పై స్పందిస్తూ మంచిదే ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిది అన్న పవన్ తెలంగాణ లో పార్టీ నడిపేందుకు తనదగ్గర డబ్బులు లేవని చేతులెత్తాశారు. అంటే తెలంగాణ లో జనసేన పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు సందేహ స్పదంగా ఉంది.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో నేడు రాజకీయ పార్టీ ని ప్రకటించారు. ఆమె తన పార్టీ పేరు వైయస్సార్ టీపీ గా నామకరణ చేశారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఆశక్తికార విషయాలు వెల్లడించారు . . ఏపీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ షర్మిల పార్టీని స్వాగతిస్తున్నాం అని జనసేన వైఖరిని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో మరిన్ని పార్టీలు రావాలని ఆకాంక్షించారు. ఉద్యమ, చైతన్య స్ఫూర్తి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
జనసేన రాజకీయ ప్రస్థానం గురించి వివరిస్తూ, తానేమీ పగటి కలలు కనడంలేదని స్పష్టం చేశారు. తనకు రాజకీయ వారసత్వం చేతకాదని పేర్కొన్నారు. “తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనుకున్నాను.. నాకు డబ్బు, బలం లేదు” అని వెల్లడించారు.