ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి… మీ తల్లిని అంటే ఒకటా?: బొత్స సత్యనారాయణ

  • శాసనమండలిలో అంబటి అంశంపై మాట్లాడిన బొత్స
  • అంబటిపై దాడి చేయడం వల్లే ఆయన ఘాటుగా స్పందించారని వ్యాఖ్య
  • అంబటిని వేధించిన వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం వేడి పుట్టిస్తోంది. ఈ అంశంపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి… మీ తల్లిని అంటే ఒకటా? అని ఆయన ప్రశ్నించారు. మహిళల విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పేనని అన్నారు. అంబటి రాంబాబు తల్లిని తిట్టిన వీడియోలు ఉన్నాయని తెలిపారు. 

అంబటిపై దాడి చేయడం వల్లే ఆయన ఘాటుగా స్పందించారని బొత్స అన్నారు. ఆయన విజ్ఞత కలిగిన వ్యక్తి కాబట్టే క్షమాపణ చెప్పారని తెలిపారు. అంబటిని వేధించిన వారంతా భవిష్యత్తుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడి చేయడం సరికాదని అన్నారు. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై కూడా దాడి చేశారని విమర్శించారు. మహిళలను బయటకు తీసుకొచ్చి రాజకీయ మైలేజీ కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Related posts

ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు… జగన్ హాజరయ్యే అవకాశం!

Ram Narayana

సీఎంను ‘కుప్పం ఎమ్మెల్యే’ అన్న వైసీపీ ఎమ్మెల్సీ… మండలిలో రగడ

Ram Narayana

సంచలనం…లోకేష్ ప్రవేశ పెట్టిన తీర్మానానికి వైసీపీ సంపూర్ణ మద్దతు ..

Ram Narayana