Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ పదవి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నాననడం హాస్యాస్పదం: ఎల్.రమణ!

ఎమ్మెల్సీ పదవి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నాననడం హాస్యాస్పదం: ఎల్.రమణ
-టీడీపీకి గుడ్ బై చెప్పిన ఎల్. రమణ: చంద్ర‌బాబుకి లేఖ‌
-నిన్న కేసీఆర్‌తో చర్చ‌లు తుది నిర్ణ‌యం తీసుకున్న ఎల్‌.ర‌మ‌ణ‌
-టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం
-ఎమ్మెల్సీ కోసమేనంటూ విమర్శలు
-తనకు పదవులు కొత్తకాదన్న రమణ
-త్వ‌ర‌లో కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ తీర్థం
-ఈటల టీఆర్ఎస్‌ను వీడిన నేప‌థ్యంలో ఎల్.ర‌మ‌ణ‌కు ప్రాధాన్య‌త‌

ఈటలకు పొమ్మన లేక పొగబెట్టిన టీఆర్ యస్ మరో బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన నేతను పార్టీ చేర్చుకుంటుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ ఉన్న రమణ టీడీపీ కు గుడ్ బై చెప్పి టీఆర్ యస్ లో చేరడంపై విమర్శలు వస్తున్నాయి. పదవులకోసమే ఆయన టీఆర్ యస్ లో చేరుతున్నారని వస్తున్నా విమర్శలపై ఆయన స్పందించారు . తనకు పదవులు కొత్త కాదని పదవులులకోసమే టీఆర్ యస్ లో చేరడంలేదనై ఆయన వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి కోసమే టీఆర్ యస్ లోకి వెళ్తున్నానని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

పదవులు తనకు కొత్త కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా చేశానని వివరించారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకే అధికార పార్టీలో చేరుతున్నానని ఎల్. రమణ స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. కేసీఆర్ తో భేటీలో ఉప ఎన్నిక అంశం చర్చించలేదని తెలిపారు.

టీడీపీ తెలంగాణ‌ అధ్యక్షుడు ఎల్.రమణ ఆ ప‌ద‌వికి గుడ్ బై చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి రాజీనామా లేఖ పంపారు. నిన్న‌ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ వ‌ద్ద‌కు వెళ్లిన ఎల్‌.ర‌మ‌ణ పార్టీ మార‌డంపై చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మారాల‌ని తుది నిర్ణ‌యం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.ర‌మ‌ణ నేటితో టీడీపీలో త‌న ప్ర‌స్థానాన్ని ముగించారు.

టీఆర్ఎస్‌లో చేరాలని తాను నిర్ణయించుకున్నట్లు రమణ ఈ రోజు అధికారికంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ‌ ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పుకొచ్చారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడికి ఆయ‌న‌ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, టీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు ఇస్తామని, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని నిన్న ఎల్.ర‌మ‌ణ‌కు కేసీఆర్ హామీ ఇచ్చారు.

దీంతో ఆ పార్టీలో చేరేందుకు రమణ అంగీకరించారు. త్వ‌ర‌లోనే టీఆర్ఎస్ అధికార కార్యాల‌యం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి కీల‌క బీసీ నేత ఈట‌ల రాజేందర్ బీజేపీలో చేర‌డంతో, ఎల్.ర‌మ‌ణ వంటి బీసీ నాయ‌కుల అవస‌‌రం ఉంద‌ని భావించిన టీఆర్ఎస్ ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకుంటోంది. టీఆర్ఎస్‌లో చేరి బీసీల కోసం కృషి చేయాల‌ని ఆయ‌న‌కు కేసీఆర్‌ సూచన‌లు చేశారు.

Related posts

ఏపీకి మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదు: కేంద్రమంత్రి అథవాలే!

Drukpadam

కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి ద్రుష్టి : నేడు వరంగల్ పర్యటన…

Drukpadam

ఆ డబ్బుతో కేసీఆర్ విదేశాలకు పారిపోతారు.. భూములు కొన్నవారు జాగ్రత్త: రేవంత్ హెచ్చరిక

Ram Narayana

Leave a Comment