Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వచ్చే ఆగస్టు తరువాత ఎన్నికలు … అధికారంలోకి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జోశ్యం!

వచ్చే ఆగస్టు తరువాత ఎన్నికలు … అధికారంలోకి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జోశ్యం!
-కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చిన వాడే!
-నా వల్లే కిషన్ రెడ్డికి కేబినెట్ ప్రమోషన్ వచ్చింది: రేవంత్ రెడ్డి
-జూబ్లీహిల్స్ లో రేవంత్ మీడియా సమావేశం
-తన రూపంలో పీసీసీకి బలమైన అధ్యక్షుడున్నాడని వెల్లడి
-అందుకే కిషన్ రెడ్డి ర్యాంకు పెంచారని వ్యాఖ్యలు
-సోనియాను కేసీఆర్ మోసం చేశారని ఆరోపణ

వచ్చే ఆగస్టు తరువాత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళతారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోశ్యం చెప్పారు. రేవంత్ మొదటిసారి పీసీసీ చీఫ్ అయిన తరువాత జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయపరిస్థితులపై స్పందించారు. తనదైన శైలిలో బీజేపీ ,టీఆర్ యస్ పార్టీలపైనా విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 72 సీట్లు వస్తాయని ,కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గాలివాటంగా వచ్చిన టీఆర్ యస్ కుప్ప కూలి పోతుందని అన్నారు.

కేంద్రంలో నిన్నటివరకు సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ వచ్చిందంటే అందుకు కారణం తానేనని రేవంత్ అన్నారు. “నా రూపంలో తెలంగాణ కాంగ్రెస్ కు బలమైన అధ్యక్షుడు ఉన్నాడు. నన్ను ఎదుర్కోవాలంటే తెలంగాణ బీజేపీ అగ్రనాయకత్వం కూడా బలంగా ఉండాలని కేంద్రం పెద్దలు భావించారు. అందుకే కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చారు” అని వివరించారు.

తనపై విమర్శలు చేస్తున్న టీఆర్ఈ యస్ నాయకులకు కేసీఆర్ ఎక్కడ నుంచి వచ్చారో తెలియదా అని అన్నారు. సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా విమర్శలు చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని చెప్పి సోనియాను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళతారని జోస్యం చెప్పారు. గాలివాటుగా గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని, ఎప్పుడైనా పేకమేడలా కూలిపోతుందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 72 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ నుంచి వచ్చానంటూ తనపై టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, సీఎం కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చినవాడేనని వారు గుర్తించాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. అంతెందుకు, తలసాని, గంగుల, కొప్పుల, మల్లారెడ్డి తదితరులు టీడీపీ నుంచి వచ్చినవారేనని అన్నారు.

Related posts

8 మంది మృతికి బాబే కారణం ….మంత్రి కాకాని మండిపాటు!

Drukpadam

ఏపీ ఎన్నిక‌ల్లో పొత్తులపై చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు!

Drukpadam

వేడెక్కుతున్న కొత్తగూడెం రాజకీయాలు ….నియోజకర్గం పై పలువురి చూపు!

Drukpadam

Leave a Comment