Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డి నియామకానికి రూ. 25 కోట్లు తీసుకున్నానా?.. క్షమాపణ చెప్పండి: ఎమ్మెల్యే సుధీర్!

రేవంత్ రెడ్డి నియామకానికి రూ. 25 కోట్లు తీసుకున్నానా?.. క్షమాపణ చెప్పండి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మాణికం ఠాగూర్ నోటీసులు
ఎమ్మెల్యే ఆరోపణలతో తీవ్ర మనస్తాపం
తన పరువుకు భంగం కలిగించారంటూ నోటీసులు
వారం రోజుల్లోగా లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని డిమాండ్

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించేందుకు రూ. 25 కోట్లు తీసుకున్నారంటూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన అసత్య ఆరోపణలపై లిఖతపూర్వకంగా, భేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసు పంపారు. సుధీర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని అందులో పేర్కొన్నారు.

సుధీర్ రెడ్డి ఆరోపణలతో మాణికం ఠాగూర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, వారం రోజుల్లోగా ఆయన లిఖిత పూర్వక సమాధానం చెప్పాలంటూ ఠాగూర్ తరపు న్యాయవాది ఆర్.రవీంద్రన్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పకుంటే కోటి రూపాయల పరువునష్టం దావాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఎందుకు నోటీసులు ఎందుకు పంపలేదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. … తొలుత కోమటిరెడ్డి ఈ విషయాన్నీ ప్రస్తావించారు. ఆయన పేరు చెప్పకపోయినా ఇంచార్జి కి డబ్బులు ఇచ్చి రేవంత్ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని వాటిని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కి అందజేస్తానని కూడా అన్నారు.

Related posts

బీజేపీపై నటి రమ్య సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన మంత్రి!

Drukpadam

సావర్కర్ విషయంలో కర్ణాటకలో మరో వివాదం!

Drukpadam

మోత్కుపల్లి కషాయానికి గుడ్ బై … గులాబీ గూటికి సై….

Drukpadam

Leave a Comment