ఖమ్మంలో ఐదు దశాబ్దాల మిత్రుల అపూర్వ కలయిక ..
ఆత్మీయతను పంచుకున్న వైనం
మళ్ళీ,మళ్ళీ కలవాలని నిర్ణయం…
కష్టసుఖాలు ,పరస్పర అభినందనలు
పిల్లాపాపల గురించి తెలుసుకొని ఆనందం
ఖమ్మంలో ఐదు దశాబ్దాల క్రితం కలిసి చదువుకొని వివిధ వృత్తుల్లో స్థిరపడి ,రిటైర్ అయిన ఎస్ అండ్ బిజి ఎం ఆర్ కళాశాల పూర్వవిద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం హోటల్ గ్రాండ్ గాయత్రిలో ఎంతో ఆహ్లదకరంగా జరిగింది …మిత్రులను కలిపేందుకు ఖమ్మంలో ఉన్న కొంతమంది పెద్దలు అనుకోని ఖమ్మంలో ఒక గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు …50 సంవత్సరాల క్రితం కలిసి చదువు కున్న స్నేహితుల అడ్రెస్స్ లు సేకరించి ఎక్కడెక్కడో ఉన్న వారిని ఒక చోట కలిపే కార్యాచరణ రూపొందించుకున్నారు …అందుకు అనుగుణంగా వారితోపాటు వారు సహధర్మచారిణులను కూడా ఆహ్వానించారు ..అందరు కలుసుకొని ఆత్మీయత పంచుకొని ఆనందంతో పరవశించి పోయారు ..వారి కష్టసుఖాలు పంచుకున్నారు …పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు …పిల్లాపాపలు గురించి అడిగి తెలుసుకున్నారు … ఆ ఆనంద క్షణాలు జీతంలో పరిచి పోలేనివని నిర్వాహకుల్లో ఒకరైన రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ సుదర్శన్ రావు తెలిపారు ..27 మంది పూర్వ విద్యార్థులతోపాటు వారి ధర్మపత్నులు మొత్తం 45 మంది ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 9 నుంచి 10 గంటలవరకు కలిసి కబుర్లు చెప్పుకున్నారు …గత తీపిగుర్తులు నెమరేసుకున్నారు …మధుర క్షణాలు జ్ఞప్తికి తెచ్చుకున్నారు .. ఆడుకున్నారు …పాడుకున్నారు …మళ్ళీ ,మళ్ళీ కలవాలని నిర్ణయంచుకున్నారు …ఒకరికొకరు అభినందించుకున్నారు … పాత రోజులు గుర్తుకు తెచ్చుకొని మెమొంటోలు బహుకరించుకున్నారు …పరస్పర అభివాదాలు , ఆలింగనాలూ ,ఒకటేమిటి చిన్న పిల్లల్లా మారిపోయారు …ఇదో అద్భుతమైన అనుభూతి అనే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి …
ఖమ్మంలో నివసిస్తున్న ఎనిమిది మంది సహ పూర్వ విద్యార్థులు యరమళ్ళ సుదర్శన రావు (రిటైర్డ్ SBH మేనేజర్) ఆళ్ల వెంకట రావు (రిటైర్డ్ పారా మెడికల్ ఆఫీసర్) బండి సత్యనారాయణ (రిటైర్డ్ జూడుసియల్ ఆఫీసర్) లక్ష్మణ రావు (రిటైర్డ్ LIC Development Officer) Ch రామారావు, D వెంకటేశ్వర్లు, D సుదాకర్ర్ చర్చించుకుని, దూర ప్రాంతాల్లో ఉన్న వారిని ఫోన్ ద్వారా సంప్రదించి ఈ కలయికను ఏర్పరచు కున్నామని ఆర్గనైజింగ్ కమిటీ కోఆర్డినేటర్ వై సుదర్శన రావు మరియు కో ట్రెజరర్స్ బండి సత్యనారాయణ, ఆళ్ల వెంకట్రావు తెలియజేశారు. ఈ కలయిక గురించి అందరూ చాలా ఆనందపడ్డారు. ఇలాంటి కలయిక ప్రతి సంవత్సరం జరుపుకోవాలని హైదరాబాద్ లో నివసిస్తున్న వాళ్ళు 2026 లో అక్కడ జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు …