పాలేరులో ఉమ్మడి అభ్యర్థి పొంగులేటిని గెలిపించండి ;సిపిఐ సమావేశంలో పోటు ప్రసాద్…
దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ తో కల్సి సిపిఐ పోటీ
పొత్తు ధర్మాన్ని పాటించి ప్రతికార్యకర్త పొంగులేటి గెలుపు కృషి చేయాలి
ప్రతిగ్రామంలో సిపిఐ -కాంగ్రెస్ సమన్వయంతో పనిచేయాలి ..
నవంబరు 30న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ ఉమ్మడి అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ కోరారు. రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్నామని పొత్తు ధర్మాన్ని ప్రతి కార్యకర్త పాటించాలని కోరారు. సిపిఐ ఖమ్మం రూరల్ మండల సమితి సమావేశం గురువారం ఖమ్మం సిపిఐ కార్యాలయంలో జరిగింది. పుచ్చకాయల సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పోటు ప్రసాద్ మాట్లాడుతూ దేశాన్ని పాలిస్తున్న బిజెపి మతం పేరుతో ప్రజల మధ్య విభజన తెచ్చి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తుందన్నారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అదే సమయంలో రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో కేసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పాలేరు నియోజక వర్గంలో గ్రామ గ్రామాన -కాంగ్రెస్, సిపిఐ కలిసి సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, సిపిఐ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, కార్యవర్గ సభ్యులు అజ్మీర రామ్మూర్తి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.