Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

నేను గుత్తేదారును కాను …నువ్వు గుత్తేదారుకాక గాడిదపాళ్ళుతోముతున్నావా..పోంగులేటిపై కందాల ఫైర్

నేను గుత్తేదారును కాను …నువ్వు గుత్తేదారుకాక గాడిదపాళ్ళుతోముతున్నావా…..పోగులేటిపై కందాల ఫైర్
ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం నానైజం …రాజకీయాల్లో భిన్నంగా ఉంటా …కందాల
మీడియా ముందుకు వస్తే ఎవరు గుత్తేదారో తేల్చుకుందాం
8 వందలకోట్లతో సి సి రోడ్లు వేయించా …
ఎన్నికల కోసం అబద్దాలు చెప్పను ..నీలాగా మాట్లాడాలంటే చాల మాట్లాడతా …!

పాలేరు బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి తన ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఫైర్ అయ్యారు ..తనను గుత్తేదారు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న విమర్శలపై గరంగరం అయ్యారు … నెలోకొండపల్లి పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ తాను 2009 లోనే కాంట్రాక్టులు మానేశానని ఇప్పుడు ఎవరు గుత్తేదారు తెలుసుకునేందుకు చర్చకు రావాలని పొంగులేటి సవాల్ విసిరారు ..నువ్వు గుత్తదారువా కదా …? లేక గాడిద పళ్ళుతోముతున్నావా ..? మండిపడ్డారు…రాజకీయాల్లో లీడర్ అనేవాడు ఉండగా ఉండాలి …ఆలా కాకుండా వ్యక్తిగత విమర్శలు ,అవాస్తవాలు మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు .నీలాగా నేను కూడా అబద్దపు మాటలు మాట్లాడాలంటే నేను కూడా ఎక్కువగానే మాట్లాడతా అని కందాల పొంగులేటి గట్టిగానే రిప్లై ఇచ్చారు …ఎన్నికల కోసం అబద్దాలు చెప్పడం నాకు రాదు …ఏది చేస్తానో అదే చెపుతా …ప్రజలకు నా చేతనైన సహాయం చేస్తా…అంతేకాని ప్రజలను మభ్యపెట్టడం చేయను …నేను పక్క లోకల్ ..ఎక్కడ నుంచో రాలేదు …గత ఐదు సంవత్సరాలుగా ఏమి చేశానో ప్రజలకు తెలుసు …మాటకు కట్టుబడి ఉండేవాణ్ణి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాను …నాకా అప్పనంగా డబ్బులు వచ్చింది నీకా అని ఘాటుగా స్పందించారు ..

మీడియా సమావేశంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా బీఆర్ యస్ అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ పాలేరు లో పార్టీలకి అతీతంగా ఉపేందర్ రెడ్డి ని వ్యక్తి గతంగా విమర్శించేవారు ఎవరూ లేరన్నారు …నాలుగు మండలాల్లో అన్ని గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు…ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ఏ ఉద్దేశ్యం తో పెట్టారో ఆ ఉద్దేశం నెరవేర్చారు….కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ఎలా వెళ్ళాయో ఉపేందర్ రెడ్డి సహాయం ప్రతి గ్రామానికి వెళ్ళింది..వ్యక్తి గతంగా ఆయన సంపాదించుకున్న దాంట్లో ప్రజలకు పంచారు…ఎవరికి వెయ్యలో ప్రజలు ఎవరికి ఓటు…చాలా మంది పాలేరు కు టూరిస్ట్ లాగా కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల నుంచి వస్తున్నారు…వచ్చిన వాళ్ళు పెద్ద మాటలు చెపుతున్నారు…నువ్వు ఎంపీ గా ఏడు నియోజకవర్గాలకు ఉన్నావ్ … అప్పుడు పాలేరు లో తట్టెడు మట్టి పోసావా, ఎంపీ గా ఉండి ఏమీ చేయలేని ఆయన పాలేరు ను ఉద్దరిస్తా అని చెపుతున్నారు…డెబ్బై సంవత్సరాలు పాలించిన వారు ఈప్రాంతంలో కరువును తీర్చలేదు,మొదటి ఇరిగేషన్ ప్రాజెక్టు భక్త రామదాసు ద్వారా రైతులకు సాగు నీటిని బీఆర్ యస్ అందించింది…ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కాలేజ్,ఫిషరీష్ కళాశాల కోట్లాడి తీసుకొచ్చారు…కేసీఆర్ వ్యవసాయానికి సకాలంలో అన్నీ ఇవ్వడంతోనే భూముల ధరలు పెరిగాయి…ఉపేందర్ రెడ్డి గుత్తేదారు,డబ్బులు అక్రమంగా వస్తే డబ్బులు పంచుతున్న అని చెపుతున్నారు..నువ్వు చేసే సంసారం,ఎదుటి వారు చేస్తే వ్యభిచారం…గత ఎన్నికల్లో 130 కోట్లు ఉన్న ఆస్తి ఇప్పుడు నీకు అన్ని కోట్లు ఎలా వచ్చాయి…

చంద్రబాబు ను అరెస్ట్ చేస్తే ఓట్ల కోసం ఒకాయన రాజకీయం చేస్తున్నారు….లఫంగి అన్నాయన అదే ఆఫీసుకు వెళ్లి కండువా కప్పుకుంటాడు…జగన్ బినామీ జగన్ ఆత్మ ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి…ఎంత ప్యాకేజీ తీసుకున్నవ్ శ్రీనివాస రెడ్డి దగ్గర….జగన్నటకాన్ని పాలేరు ప్రజలకు వివరించాలి…పీసీసీ అధ్యక్షుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుండు.
రేపు మూడో తారీకు నీకు నీ పార్టీకి ప్రజలు పిండాలు పెడతారు.ప్రగతి భవన్ ప్రజల అస్తి.
మోసగాడు నయవంచకుడు పార్టీకి అధ్యక్షుడు గా ఉండటం సిగ్గుచేటు…సత్తుపల్లి నుంచి పాలేరు కు ప్రయాణం కట్టిన వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…మన లోకల్ వ్యక్తి ఉపేందర్ రెడ్డి, మీరు ఉపేందర్ రెడ్డిని గెలిపించండి అని మధు పిలుపు నిచ్చారు ..

Related posts

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Ram Narayana

గెలుపు నాదే …రూ 400 కే సిలిండర్ …మహిళకు రూ 3 వేల పెన్షన్ …కందాల

Ram Narayana

ఆ మూడూ వ్యక్తి స్వేచ్ఛనూ హరించే చట్టాలు..సిపిఎం సెమినార్ లో వక్తలు

Ram Narayana

Leave a Comment