ఎన్నికల తరువాత బీఆర్ యస్ కనుమరుగు …సీఎల్పీ నేత భట్టి
ప్రజల సంపందను పందికొక్కుల్లా పంచుకుతిన్నారని ఘాటు విమర్శలు
కేసీఆర్ పాలనను వదిలించుకునేందుకు ప్రజలు సిద్దమైయ్యారు …
కాంగ్రెస్ సునామి సృష్టించబోతోంది..
72 నుంచి 78 సీట్లలో విజయం ఖాయం ..
పీపుల్స్ మార్చ్ లో ప్రజల స్పందన గమనించా
ప్రజల సమస్యలను పరిష్కరించాలనే సోయి సీఎంకు గానీ ఇక్కడ పోటీచేస్తున్న అభ్యర్థికి గానీ లేదు ..
ఆరు గ్యారంటీల పై సంతకం చేసి అములు చేస్తామని ఇస్తున్నాం ..మీకు ఆదమ్ము ఉందా ..?
ఎన్నికల తర్వాత బీఆర్ యస్ కనుమరుగు కావడం ఖాయమని ,కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కాకతప్పదని సీఎల్పీ నేత మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క కేసీఆర్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేశారు .. రాష్ట్రంలో 72 నుంచి 78 సీట్లలో కాంగ్రెస్ గెలవబోతుందని అధికారం చేపట్టిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలు ప్రారంభిస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారు.. మధిర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న భట్టికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుంది… ఎక్కడకు వెళ్లిన భట్టి సీఎం ,సీఎం అంటూ నినదిస్తున్నారు….భట్టి కూడా ప్రజల నుంచి వస్తున్నా ఆదరణకు రెట్టించిన ఉత్సహంతో ప్రచారంలో ప్రభుత్వం విధానాలపై విరుచుకపడుతునాన్రు.. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రజల సంపదను పందికొక్కుల్లా తింటున్నారని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని వడ్డీతో సహా వసూల్ చేస్తుందని అన్నారు..కాళేశ్వరం ప్రాజక్టు అవినీతిమయమని అనేక సందర్భాల్లో శాసనసభ వేదిక సాక్షిగా చెప్పమని ,ఇప్పుడు మేడిగడ్డ వద్ద ఏమైందో అందరికి తెలుసునని కేసీఆర్ పై ధ్వజమెత్తారు …
ఈనెల 30 జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వేవ్ ప్రభంజనంలా ఉంటుందని అన్నారు …అన్ని జిల్లాల నుంచి వస్తున్నా సమాచారం ప్రకారం మేము అనుకున్నదానికంటే ప్రజల నుంచి కాంగ్రెస్ ఆదరణ సునామి సృష్టించడం ఖాయమని పేర్కొంటున్నారు ..కేసీఆర్ రెండు టర్మ్ లుగా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా తనకు తోచిన పథకాలు తెచ్చి వాటిని మధ్యలో నిలిపేస్తున్నారని ఎద్దేవా చేశారు ..ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ఫామ్ హౌస్ లో పడుకున్న సీఎం కేసీఆర్ ఒక్కరే అని అన్నారు .సచివాలయానికి రాకుండా పాలనా చేసిన సీఎం కూడా కేసీఆర్ అని దెప్పిపొడిచారు …
ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించడానికి రాష్ట్రంలో పీపుల్స్ మార్చ్ నిర్వహించానని అప్పడే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోగలిగానని అన్నారు .అధికారంలో ఉండి ప్రజా సమస్యల పరిష్కరించాలన్న సోయి సీఎంకు ఉందా ?నీకు ఉందా? అంటూ కమల్ రాజు పై విమర్శలు గుప్పించారు …కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు కావలసిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని సంతకం పెట్టిన హామీ పత్రాన్ని ఇంటింటికి పంపించాను. ఇట్లాంటి హామీలు ఇచ్చి సంతకం పెట్టే దమ్ము మీకుందా? భట్టి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు …పాలించేవాడిగా ప్రశ్నించే వాడిగా ఎక్కడ ఉన్న మధిర ఓటర్లు తలెత్తుకునేలా చేశానని రేపు కూడా మధిర నియోజకవర్గ ప్రజలు గర్వపడేలా మసులుకుంటానని అన్నారు ..