హైద్రాబాద్ వార్తలు

హైదరాబాద్ లోని ‘తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు మారింది!

  • ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్ గా పేరు మార్పు
  • పేరు మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
  • కొత్త పేరుతో బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు

హైదరాబాద్ లోని కీలకమైన ఫ్లైఓవర్లలో ఒకటైన ‘తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ పేరును ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త పేరుతో కూడిన బోర్డును సైతం ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేయడంతో ఈ మార్పు అధికారికంగా అమల్లోకి వచ్చింది.

రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం సమీపంలో ఈ ఫ్లైఓవర్ ఉంది. ఇప్పటివరకు ‘తెలుగు తల్లి’ ఫ్లైఓవర్‌గా అందరికీ సుపరిచితమైన ఈ ఫ్లైఓవర్… ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా గుర్తింపు పొందనుంది. నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే ఈ మార్గంలో అధికారులు కొత్త పేరును సూచిస్తూ బోర్డును ఏర్పాటు చేశారు.

Related posts

పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం…

Ram Narayana

‘హైడ్రా’ ..ముఖ్యమంత్రి సోదరుడితో పాటు పలువురికి నోటీసులు

Ram Narayana

బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర 30 లక్షల ఒక వెయ్యి…

Ram Narayana