ఖమ్మం వార్తలు

మంత్రి తుమ్మలకు లాప్టర్ యోగ జాతీయ సదస్సు ఆహ్వానం

మంత్రి తుమ్మలకు లాప్టర్ యోగ జాతీయ సదస్సు ఆహ్వాన పత్రిక అందజేత
రాష్ట్ర వ్యవసాయ ,చేనేత ,సహకార శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారికి 12 అక్టోబర్ ఆదివారం ఖమ్మం లో జరగబోయే లాఫ్టర్ యోగ జాతీయ సదస్సు ఆహ్వాన పత్రిక అందజేసి వారిని ఆహ్వానించినట్లుగా లాఫ్టర్ యోగ సొసైటీ జాతీయ చైర్మన్ మరియు తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష సేవక్ మరికంటి వెంకట్ అడ్వకేట్ తెలిపారు ఈ సదస్సుకు మంత్రులతో పాటుగా ఆంధ్ర నుంచి శిక్షణ సంస్థలు శిక్షకులు వస్తున్నారు లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ టేస్టీ మెడిసిన్ బుక్ ,క్యాలెండర్, డైరీ ,మరియు ఉచిత జాతీయ స్థాయి లాఫ్టర్ యోగ 2.0 శిక్షణ సాధన కేంద్రం వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ కేంద్రం ఖమ్మం లోగో ఆవిష్కరణలు ఉంటాయి 9 గంటల నుంచి 11 గంటలకు లాప్టర్ మెడిటేషన్, రెండు నుంచి నాలుగు గంటల వరకు లాఫింగ్ యోగ ఫీస్టు కార్యక్రమాలు ఉంటాయని బీపీ లేని హ్యాపీ భారత్ కాన్సెప్ట్ గా ఈ కార్యక్రమం సదస్సు నిర్వహణ జరుగుతుందని ఈ కార్యక్రమానికి తెలంగాణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి ద్వారకనాధ్ రెడ్డి గారు సౌత్ ఇండియా సైకియాట్రిస్ట్స్ సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ పి కిషన్ గారు పాల్గొంటున్నారని ఈ సదస్సుకు వేలాదిగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరారు

Related posts

పాలేరు గడ్డపై సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పండగ… మంత్రి పొంగులేటి

Ram Narayana

ఖమ్మంలో రౌడీ రాజ్ ..మంత్రి మనుషుల దౌర్జన్యాలు …మాజీమంత్రి ఫైర్…

Ram Narayana

జిల్లాలో మంత్రులు ,తుమ్మల , పొంగులేటి పర్యటనలు

Ram Narayana