ఆఫ్ బీట్ వార్తలు

బావిలో పడ్డ ఏనుగులు.. బయటకు తీసేందుకు అధికారుల యత్నం..!

––

అటవీ ప్రాంతంలోని ఓ బావిలో నాలుగు ఏనుగులు పడిపోయాయి.. స్థానికులు గమనించి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వాటిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లోని హార్దీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బావిలోని నీళ్లలో ఏనుగులు సాయం కోసం ఎదురుచూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఛత్తీస్‌గఢ్‌లోని బర్నవాపారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం సమీపంలోని హార్దీ గ్రామంలో ఉన్న ఓ ఓపెన్ బావిలో ప్రమాదవశాత్తూ ఏనుగులు పడిపోయాయి. బావిలోని ఏనుగులను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది.. ఏనుగులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. అటవీ ప్రాంతాల్లో ఓపెన్ బావులను పూడ్చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Related posts

మెడికల్ మిరాకిల్.. మ‌హిళ‌కు పంది కిడ్నీ.. 130 రోజుల త‌ర్వాత తొల‌గింపు!

Ram Narayana

శాన్‌ఫ్రాన్సిస్కో నగరాన్ని అట్టుడికించిన ‘పిల్లి చావు’!

Ram Narayana

లంచ్ బాక్స్ మరచిపోయారంటూ ఆఫీస్‌కు వెళుతున్న భర్తకు భార్య ఫోన్.. అదృష్టం తలుపు తట్టింది!

Ram Narayana