నేరేడుచర్ల ఎస్సై రవీందర్ కు హ్యాట్సాప్…
మూసి నదిలో పడిన సుస్మిత(13) శవాన్ని వెతికి తెచ్చిన ఎస్ ఐ కి గ్రామస్తుల నీరాజనాలు
నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన సుస్మిత (13) మూసీనది ప్రవాహంలో కొట్టుకొని పోయింది ..గ్రామస్తులు వెతికిన ఆచూకీ లభించలేదు …దీంతో నేరేడుచర్ల ఎస్ ఐ ని కుటుంబసభ్యులు తమ కూతురు ప్రాణాలతో లేకపోయినా శవమైన వెతికి పెట్టాలని ప్రాధేయ పడ్డారు ..దీంతో వారి భాదను అర్ధం చేసుకున్న ఎస్ ఐ దాదాపు రోజున్నర వెతికి శవాన్ని కనుక్కొని అక్కడకు ఈదుకుంటా వెళ్లి తీసుకోని వచ్చారు …ఎస్ ఐ పట్టుదల వల్లనే తమ బిడ్డ శవం దొరికిందని తల్లిదండ్రులు అన్నారు ..

వివరాల్లోకి వెళ్ళితే …సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమరం గ్రామానికి చెందిన కోమర్రాజు సుస్మిత మూసి నదిలో గల్లంతైన సమయం నుండి నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ చేసిన కృషి మరవలేనిది అని స్థానికులు తెలిపారు… నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో మృతదేహం లభ్యం అవుతుందా అనే సందేశాలు వ్యక్తం అవుతున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని ప్రాణాలు లేకున్నా ఆమె మృతదేహం అయినా చూసేందుకు ఎస్ఐ రవీందర్ ను ప్రాధాయపడ్డారు..తల్లిదండ్రుల బాధలను గుర్తించిన ఎస్ ఐ రవీందర్ సుస్మిత మృతదేహం కోసం రాత్రి 8 గంటల వరకు వెతికిన దొరకలేదు.. ఆదివారం ఉదయం 6:00 గంటల నుండి గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 10 గంటల సమయంలో మూసి అవతలి వైపు మృతదేహాన్ని గుర్తించారు..
మృతదేహాన్ని తీసుకురావాలంటే కష్టతరంగా మారింది ఏమాత్రం చిన్న పొరపాటు జరిగిన మృతదేహం మళ్ళీ నీటి ప్రవాహం లో కొట్టుకు వెళ్లే అవకాశం ఉంది..ఎస్ ఐ రవీందర్ తనే స్వయంగా ఈత కొడుతూ అవతల ఒడ్డు కెళ్లి అవతల ఉన్న వ్యక్తులు సాయంతో తెప్పపై ఆ మృతదేహాన్ని తీసుకొని ఒడ్డుకు చేర్చారు…