తెలంగాణ వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Telangana Government Key Decision on Local Body Elections
  • రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
  • డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు
  • వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రజాపాలన వారోత్సవాలు, సౌదీ అరేబియా ప్రమాదంలో మరణించిన వారికి పరిహారం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో, డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం.. మిగిలిన ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం

పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం

మిగిలిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్ని కూడా కోర్టు తీర్పు తర్వాత నిర్వహిస్తాం

– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Related posts

ల్యాంప్ కొందామని వెళ్లి.. తెగ షాపింగ్ చేసిన యువతి.. అర చేతిలో ఆరు అడుగుల రశీదు!

Ram Narayana

అధికారులకు ధర్మ సంకటం …పంచాయతీ ఎన్నికల్లో చనిపోయిన వ్యక్తికీ అత్యధిక ఓట్లు

Ram Narayana

పార్టీని వీడినా నష్టం లేదు : తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు హెచ్చరిక

Ram Narayana