తెలంగాణ వార్తలు

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 30 మంది ఉర్దూ జర్నలిస్టులు ఐజేయూ లో చేరిక

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ సంఘాల్లో ఉన్న 30 మంది ఉర్దూ జర్నలిస్టులు ఆయా సంఘాలకు బై బై చెప్పి టీయూడబ్ల్యూజే (ఐజేయూ )జై కొట్టారు …సంఘ కార్యకలాపాలు తమను ఎంతో ఆకర్షించాయని ఏ సంఘం చేయని విధంగా ఉమ్మడి జిల్లాలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ )జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కోసం పనిచేస్తుందని వారు అన్నారు …ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జర్నలిస్టులు రాష్ట్ర కార్యదర్శి జి .మధుగౌడ్ ఆధ్వరంలో హైద్రాబాద్ లోని బషీర్ బాగ్ లోగల యూనియన్ కార్యాలయం దేశోద్ధారక భవన్ కు వచ్చి రాష్ట్ర అధ్యక్షులు కె .విరాహత్ అలీ సమక్షంలో టీయూడబ్ల్యూజే సభ్యత్వం స్వీకరించారు ..

ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని పోరాటాలు నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని పోరాటాలు చేసిన ఘనత కేవలం తమ సంఘానికి మాత్రమే దక్కిందని, 70ఏళ్ళ సుధీర్ఘ చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం ఏ పార్టీకీ కానీ, ఏ ప్రభుత్వానికి గానీ అనుబంధంగా పనిచేయలేదని, ప్రొఫెషనల్ ట్రేడ్ యూనియనిజం తమ సంఘం ఏకైక లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ స్పష్టం చేసారు., రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎలాంటి ఆపద వచ్చినా, వారికి చేదోడుగా నిలబడి ఆదుకునే చిత్తశుద్ధి తమ సంఘానికి మాత్రమే ఉందని, అందుకే రాష్ట్రంలో వేలాది కలం కార్మికుల ఆదరాభిమానాలతో తమ సంఘం దేశంలో రోల్ మోడల్ గా నిలబడడం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలన్నీ తమ సంఘం పోరాట ఫలితమేనన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆయా కమిటీల్లో ఉర్దూ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు తాము కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆయన విచారం వ్యక్తం చేసారు. ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం అసెంబ్లి ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను చేర్చడంతో, జర్నలిస్టుల్లో ఆశలు చిగురించాయని, అయితే అధికారాన్ని చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా నేటికి ఏ ఒక్క సమస్యను కూడా
పరిష్కరించకపోవడంతో జర్నలిస్టుల్లో నిరాశ తప్పడం లేదన్నారు. కనీసం అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు జారీ చేయడంలో జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.మధు గౌడ్, కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, యూనియన్ మహబూబ్ నగర్ జిల్లా సీనియర్ నాయకులు విజయసింహా రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొంతకాలంగా యూనివర్సిటీలపై నమ్మకం సన్నగిల్లుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..!

Ram Narayana

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. రెస్క్యూ ఆపరేషన్ కోసం వచ్చిన ‘ర్యాట్ మైనర్స్’

Ram Narayana

జూబ్లీహిల్స్ లో మూగపోయిన మైకులు …నియోజవర్గంలో బయట వ్యక్తులు నో పర్మిషన్

Ram Narayana