జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఇక ఉద్యమాలే…
టియూడబ్ల్యూజె(ఐజెయూ) జిల్లా కార్యవర్గ సమావేశంలో
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాం నారాయణ
విద్య, హెల్త్, వెల్ఫేర్, దాడుల నివారణా కమిటీలు ఎన్నిక

దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాబోయే కాలంలో
ఉద్యమాలు విస్త్రతం చేయనున్నట్లు టియూడబ్ల్యూజె(ఐజెయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాం
నారాయణ పేర్కొన్నారు. ఐజెయూ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు ఏనుగు వెం
కటేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మంలోని డపిఆర్‌సి భవన్‌లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. అందుకే ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలిపారు. మండలాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ, జిల్లా కేంద్రంలోనూ ఏక కాలంలో ఆందోళనలు జరిపి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఖమ్మం నగరంలోని జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్లస్థలాన్ని వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని మండలం, డివిజన్ కేంద్రాల్లోనూ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలతో పాటు హెల్త్‌కార్డులు అందచేయాలన్నారు. పోరాట బాట పడితేనే ప్రభుత్వంలో కదలిక వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా యూనియన్ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి మైసా పాపారావు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ఇంకా ఈ సమావేశంలో యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు నలజాల వెంకట్రావ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్, స్తంభాద్రి హౌజింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషన్, హెల్త్, సెమినార్ నిర్వహణ, సంక్షేమం, దాడుల నివారణా కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సావిునేని మురారి, ఎల్‌క్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షులు భూపాల్, కార్యదర్శి మహేందర్, నగర అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాసరావు, ఖమ్మం ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు నామా పురుషోత్తం, యూనియన్ నగర కార్యదర్శి జనర్దనాచారి, కోశాధికారి ఏలూరి వేణు, సీనియర్ జర్నలిస్టులు తాళ్లూరి మురళీకృష్ణ, వెుహిద్దీన్, వేగినాటి మాధవరావు, పి.సత్యనారాయణ, శీలం శ్రీనివాస్, కళ్యాణ్ తదితరులు
పాల్గొన్నారు.
దాడుల నివారణ కమిటీ ః
టి.మురళీకృష్ణ కన్వీనర్‌గా, పి.నాగేశ్వరరావు, యోగి, శ్రీనివాస్, సురేష్, బాలరాజు, పప్పుల శ్రీను, శీలం శ్రీను సభ్యులుగా దాడుల నివారణ కమిటీ ఎన్నికైంది.
హెల్త్ కమిటీ ః
వై.మాధవరావు కన్వీనర్‌గా, కె.సైదులు, సిహెచ్ శ్రీనివాస్, ఎన్.ఉపేందర్, గోపాల్, బాబూరావు,
అరుణ్, నాగరాజు సభ్యులుగా హెల్త్ కమిటీ ఎన్నికైంది.
సెమినార్ నిర్వహణా కమిటీ ః
ఎం.వేణుగోపాల్ కన్వీనర్‌గా ఎం.భూపాల్, ఏ.వెంకటేశ్వరరావు, మహేందర్, ఎస్‌కె మోహిద్దీన్,
ఏలూరి వేణుగోపాల్, సత్యనారాయణ సభ్యులుగా సెమినార్ నిర్వహణా కమిటీ ఎన్నికైంది.
వెల్ఫేర్ కమిటీ ః
సామినేని మురారీ కన్వీనర్‌గా ఎన్.వెంకట్రావ్, నామా పురుషోత్తం, ఎన్.జనార్దనాచారి, ఎం.పా
పారావు సభ్యులుగా వేల్ఫేర్ కమిటీ ఎన్నికైంది.