ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ..సీఎం రేవంత్ రెడ్డి
యూనివర్సిటీ అభివృద్ధి పనులపై సమీక్ష
అభివృద్ధి కోసం విద్యార్థులు అభిప్రాయాలు
ఈనెల 10 యూనివర్సిటీని సందర్శించాలని సీఎం నిర్ణయం
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… సమీక్ష నిర్వహించారు …ఉన్నతస్థాయి అధికారులతో నిర్వహించ ఈ సమీక్షలో యూనివర్సిటీ లో జరగాల్సిన అభివృద్ధి పనులు కొత్త భవనాలు గురించి విద్యార్థులతో కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావాలని నిర్ణయించారు ..అందులో భాగంగా ఈ నెల 10 న యూనివర్సిటీ ని సందర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు .
విద్యార్థుల సంఖ్య ఆధారం గా యూనివర్సిటీ లో భవన నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలి. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధం ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు .
యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళిక పైన విద్యార్థుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు .. అన్ని అభిప్రాయాలు క్రోడీకరించుకుని డిసెంబర్ 31 న పూర్తి ప్రణాళిక ను ప్రకటించాలని ఆదేశాలు జారీచేశారు
ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీ గా ఉస్మానియా ను తీర్చిదిద్దాలన్నది తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ..ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఇతర ఉన్నతాధికారులు
పాల్గొన్నారు.