- గ్రేటర్ హైదరాబాద్‌లో రెట్టింపైన వార్డుల సంఖ్య
- 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు
- 27 మున్సిపాలిటీల విలీనమే ఇందుకు ప్రధాన కారణం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో వార్డుల సంఖ్యను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నగర పాలన, పరిపాలన సౌలభ్యం కోసం ఈ మార్పు చేసినట్లు స్పష్టం చేసింది.
ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ సమీపంలోని 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ నేపథ్యంలో పెరిగిన జనాభా, విస్తీర్ణానికి అనుగుణంగా వార్డుల పునర్విభజన అనివార్యమైంది. ఇందులో భాగంగానే వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ రాజకీయ స్వరూపం పూర్తిగా మారనుంది. వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికారులు త్వరలోనే ప్రారంభించనున్నారు. కొత్తగా విలీనమైన ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, అభివృద్ధి పనులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ పెంపు దోహదపడుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే కార్పొరేషన్ ఎన్నికలు 300 వార్డుల ప్రాతిపదికనే జరగనున్నాయి.
మీనీ అసెంబ్లీగా హైదరాబాద్ నగర పాలక సంస్థ డివిజన్ల సంఖ్య 150 నుంచి 300 కి పెంపు …
హైదరాబాద్ నగరపాలక సంస్థ గతంలో 150 డివిజన్లు ఉండగా ఇప్పుడు పరిధి విస్తరించడంతో వాటి సంఖ్య డబుల్ అయింది .. దీంతో డివిజన్ల సంఖ్య 300కు చేరుకుంది ఫలితంగా ఇది మినీ అసెంబ్లీగా మారింది. గతంలోని 150 మందికి సరిపోను ఉన్న కాన్ఫరెన్స్ హాల్ ఇప్పుడు మరింత పెరగాల్సి ఉంది .అంటే సీట్ల సంఖ్యకు అనుగుణంగా ఇప్పుడు 300 నుంచి 400 వరకు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అంటే దాదాపు అసెంబ్లీ కన్నా ఎక్కువ సీట్లు అన్నమాట .. ప్రస్తుతం అసెంబ్లీ సభ్యుల సంఖ్య రాష్ట్రంలో 119 కాగా రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం అసెంబ్లీ సభ్యుల సంఖ్య పెరిగిన 153 అవుతుందని లెక్కలు చెబుతున్నాయి. అంటే కోటి కోటిన్నర పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ దేశంలో కొన్ని రాష్ట్రాల కన్నా పెద్దదిగా మారనున్నది .. ఈశాన్య రాష్ట్రాలు కన్నా కూడా ఎక్కువ జనాభా కలిగి ఉంటుంది .. దీంతో హైదరాబాద్ నగరపాలక సంస్థ ఒక మినీ అసెంబ్లీగా చెప్పుకోవచ్చు. దాదాపు 300 డివిజన్లు ఏర్పడటంతో రేపు జరగబోయే జరగబోయే ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపించే లాగా ఉన్నాయి. పార్టీలు ఎవరికి వారు పోటీపడి పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ బీ ఆర్ఎస్ బిజెపి ఎంఐఎం పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. వాటి తోడు చిన్నాచిత పార్టీలు ఉన్నప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపక పోవచ్చు .