Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ స్పీకర్ తమ్మినేని నోట చట్ట వ్యతిరేక మాట!

ఏపీ స్పీకర్ తమ్మినేని నోట చట్ట వ్యతిరేక మాట!
-మృగాళ్లను క్షమించరాదని వెల్లడి
-అలాంటివాళ్లను అవసరమైతే చట్టాలను పక్కనబెట్టి మరీ వేటాడాలి
-శ్రీకాకుళంలో దిశ కార్యక్రమం సందర్భంగా తమ్మినేని
-దిశ యాప్ ద్వారా సమాజంలో మార్పు రావాలన్న తమ్మినేని
-నాటి దిశ ఎన్ కౌంటర్ ప్రస్తావన
-సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను అభినందించిన స్పీకర్

అత్యాచారం చేసిన వాళ్ళను ఎవరు సమర్థించరు…వారికీ తగిన శిక్ష పడాలని కోరుకుంటారు. అది రాజ్యాగబద్దంగా జరగాలని నియమ నిబంధనలు ఉన్నాయి. అత్యాచార నిందితులకు వివిధ దేశాలలో వివిధ రకాలుగా శిక్షలు అమలు జరుగుతున్నాయి. ఒకవేళ శిక్షలు సరిగా లేవనిపించినప్పుడు చట్టాలు మార్చాల్సిఉంది.చట్టాలు మార్చాలని కోరడంలో తప్పులేదు… కాని చట్టాలు చేసే సభకు అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి అవసరమైతే చట్టాలను పక్కన పెట్టి శిక్షలు విధించాలని కోరడం ఏరకంగా సమర్థనీయం … ఆయన ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకున్నారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. దాన్ని కూడా ఎవరు కాదనరు.కానీ మృగాలుగా మారిన మగాళ్లను అవసరమైతే చట్టాలను పక్కన పెట్టి వేటాడాలని అనడం రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న స్పీకర్ కు ఏ రకంగానూ సమర్థనీయం కాదు . చట్టాలను మార్చండి.అందుకు మీవంతు కృషి చేయండి. అంతే కానీ మీరే చట్టాలను పక్కన పెట్టి వేటాడాలని మాట్లాడటం మంచిది కాదేమో ఆలోచించండి. పైగా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ చర్యలను సమర్థించారు.అంటే ఆయన చట్టాన్ని పక్కన పెట్టి వ్యవహరించారని స్పీకర్ తమ్మినేని చెప్పదలుచుకున్నారా ? సజ్జనార్ కూడా అందుకు అంగీకరించరు. ఆయన చట్ట ప్రకారమే నడుచుకున్నామని చెబుతున్నారు. అందుకు కావలసిన గ్రౌండ్ ప్రిపేర్ ఆయన చేసుకున్నారు. తమ్మినేని మాటలు మాత్రం ఆయన చట్టాన్ని పక్కన పెట్టినడుచుకున్నట్లు ఉంది. దీనిపై సజ్జనార్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి మరి !

స్పీకర్ తమ్మినేని దిశా కార్యక్రమం లో పాల్గొన్న సందర్భంగా …

శ్రీకాకుళంలో శుక్రవారం దిశా కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పాల్గొన్నారు. దిశ యాప్ ద్వారా సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్ ఘటనను ప్రస్తావించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను అభినందిస్తున్నట్టు తెలిపారు. సమాజంలో పురుషుల ఆలోచనా ధోరణి మారాలని పిలుపునిచ్చారు.

మృగాలుగా మారిన మగవాళ్లను క్షమించరాదని అన్నారు. అవసరమైతే చట్టాలను పక్కనబెట్టి అలాంటివారిని వేటాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమాజానికి రక్షణ ఇవ్వాల్సిన మగాడే మృగంలా మారితే ఎలా? అని వ్యాఖ్యానించారు. అత్యాచారాలకు పాల్పడే వారు భూమిపై ఉండేందుకు పనికిరారని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాముడు, కృష్ణుడు తిరిగిన పుణ్యభూమిలో ఇలాంటి దుర్మార్గాలు ఏంటని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. నైతికత ఏమాత్రం లేని రీతిలో కన్నతండ్రులే పసిమొగ్గలను చిదిమేస్తున్న ఘటనలు దారుణమని భావోద్వేగాలకు లోనయ్యారు.

Related posts

బీబీసీకి అండగా యూకే ప్రభుత్వం..

Drukpadam

జెలెన్ స్కీని చంపడానికి ఆఫ్రికా నుంచి 400 మంది ప్రొఫెషనల్ కిల్లర్స్…

Drukpadam

రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ వార్నింగ్…

Drukpadam

Leave a Comment