Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేశవరావు ఒకే మరి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంగతేమిటి …కేటీఆర్

 కేశవరావు రాజ్యసభకు రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నాం

  • కాంగ్రెస్‌లో చేరిన కేకే… రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైనం
  • కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామా మాటేమిటని కేటీఆర్ ప్రశ్న
  • రాజ్యాంగాన్ని మీరు ఎలా నిలబెట్టాలనుకుంటున్నారని ప్రశ్న

తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కె.కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే బీఆర్ఎస్ టిక్కెట్‌పై పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరిన పలువురు ఎమ్మెల్యేల సంగతి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్‌పై గెలిచిన దాదాపు అరడజను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్నారు. కేకే రాజీనామా చేయడం స్వాగతించదగ్గదేనని… మరి ఎమ్మెల్యేల సంగతి ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని నిలబెడదామని రాహుల్ గాంధీ చెబుతున్నారని… కానీ ఇలా రాజ్యాంగాన్ని నిలబెడతారా? అని నిలదీశారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫిరాయింపులకు అవకాశం లేకుండా పదో షెడ్యూల్‌ను సవరిస్తామని కాంగ్రెస్, రాహుల్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా మీరు దేశానికి ఏం సందేశం ఇస్తున్నట్లు? ఈ దేశం మిమ్మల్ని ఎలా విశ్వసిస్తుంది? అని ప్రశ్నించారు. మీరు చెప్పినట్లుగా ఇది ‘న్యాయ పత్రం’ ఎలా అవుతుందో చెప్పాలన్నారు.

Related posts

ఉగాది తర్వాత జనంలోకి గులాబీ బాస్ ….

Ram Narayana

జనసేనతో కలిసి పని చేయండి: కిషన్ రెడ్డికి అమిత్ షా సూచన

Ram Narayana

ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిని కలసినవారు పేర్లు త్వరలో బయట పెడతా …రోహిత్ రెడ్డి !

Ram Narayana

Leave a Comment