Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు సోనూసూద్‌..

ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాన‌ని హామీ!

  • మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ వ‌ద్ద‌ ఉన్న ఆమె ఫుడ్ స్టాల్‌ను సందర్శించిన సోనూసూద్‌
  • ఆమెతో సరదాగా మాట్లాడుతూ.. పంచ్‌లు వేస్తూ అందరినీ నవ్వించిన రియ‌ల్ హీరో
  • కుమారి ఆంటీని శాలువాతో సత్కరించి బొకే ఇచ్చిన సోనూసూద్‌
  • వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్

కుమారి ఆంటీ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమె సోషల్ మీడియాలో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిపోయారు. ముఖ్యంగా ‘మీది మొత్తం థౌజెండ్ అయ్యింది. రెండు లివర్స్ ఎక్స్ ట్రా’ అనే డైలాగ్‌తో ఆమె చాలా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ డైలాగ్ పై చాలా మంది రీల్స్ కూడా చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫుడ్ స్టాల్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ఫుడ్ స్టాల్‌కు ప్రముఖ నటులు, సెలబ్రిటీలు కూడా క్యూ కడుతున్నారు. 

తాజాగా రియల్ హీరో సోనూసూద్ కూడా కుమారి ఆంటీని ఆమె స్టాల్ వ‌ద్ద‌కు వెళ్లి కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న ఆమె ఫుడ్ స్టాల్‌ను సందర్శించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. రియల్ హీరోను చూసిన కుమారి ఆంటీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోనూసూద్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడకు త‌ర‌లివ‌చ్చారు. 

ఈ సంద‌ర్భంగా ఆమెతో సరదాగా మాట్లాడారు సోనూసూద్. పంచ్‌లు వేస్తూ అందరినీ నవ్వించారు. మీ ద‌గ్గర ఎలాంటి వంట‌కాలు దొరుకుతాయ‌ని ఆమెను సోనూసూద్ అడిగారు. త‌న వ‌ద్ద అన్ని ర‌కాల వెజ్‌, నాన్‌వెజ్ ఫుడ్ దొరుకుంద‌ని కుమారి ఆంటీ చెప్పారు. అలాగే వెజ్ వెల రూ. 80 అని, నాన్‌వెజ్ రూ. 120 అని ఆమె తెలిపారు. దీనికి సోనూసూద్ తాను మాత్రం వెజ్ తింటాన‌ని అన్నారు. 

త‌న‌కు ఏదైనా డిస్కౌంట్ ఉంటుందా? అంటూ ఆమెను అడిగారు. దానికి కుమారి ఆంటీ మీకైతే ఫ్రీగా వ‌డ్డిస్తాన‌ని అన్నారు. క‌రోనా స‌మ‌యంలో ఎంతో మందికి సాయం చేసిన మీకు ఎంత పెట్టినా త‌క్కువే అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత కుమారి ఆంటీకి సోనూసూద్‌ ఫుడ్ సైతం సర్వ్ చేశారు. అనంత‌రం ఆమెను శాలువాతో సత్కరించి బొకే ఇచ్చారు. కాగా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ఫ‌తే సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ మూవీ ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న హైదరాబాద్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. 

కుమారి ఆంటీపై సోనూసూద్‌ ప్రశంసలు
ఈ సందర్భంగా కుమారి ఆంటీపై సోనూసూద్ ప్రశంసలు కురిపించారు. మహిళా సాధికారతకు ఆమె బెస్ట్ ఉదాహరణ అని కొనియాడారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. రియల్ హీరో కుమారి ఆంటీని కలిసిన వీడియోలు, ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Related posts

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఎం నేత తమ్మినేని…

Ram Narayana

తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు…లోక్ సభ నియోజకవర్గాలకు ఏఐసీసీ పరిశీలకుల నియామకం.. !

Drukpadam

రేవంత్ రెడ్డి తీపి కబురు చెబుతారు…!: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana

Leave a Comment