Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కావాలనే పార్లమెంట్​ సమావేశాలకు అడ్డంకులు: కాంగ్రెస్​ తీరుపై ప్రధాని మండిపాటు

కావాలనే పార్లమెంట్​ సమావేశాలకు అడ్డంకులు: కాంగ్రెస్​ తీరుపై ప్రధాని మండిపాటు
-ఎండగట్టాలని బీజేపీ ఎంపీలకు సూచన
-కాంగ్రెస్ కు సభ నిర్వహణ ఇష్టమే లేదని కామెంట్
-అందుకే అఖిల పక్ష సమావేశానికి రాలేదని అన్న ప్రధాని
-అసలు నిజాలను ప్రజలకు తెలియజెప్పాలన్న మోదీ
-ఆగస్టు 15 తరువాత నియోజకవర్గాలలో పర్యటించండి ఎంపీలకు సూచన
– కర్ణాటక సీఎం రాజీనామా ,ఎన్నికల జరిగే రాష్ట్రాల విషయంపై చర్చ

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలను ఆ పార్టీ కావాలనే అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను ఎదుర్కొనే విధానంపై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.

సభలో చర్చలు జరగకుండా, సభ నడవకుండా ఆటంకాలు సృష్టిస్తోందని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఆ పార్టీకి అసలు సభ నిర్వహణ ఇష్టమే లేనట్టుందని అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికీ కాంగ్రెస్ నేతలు హాజరు కాలేదంటేనే.. వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చని గుర్తు చేశారు. ఆ పార్టీ నేతల తీరును జనం వద్ద, మీడియాలోనూ ఎండగట్టాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని సూచించారు. ఆగస్టు 15 తర్వాత బీజేపీ ఎంపీలంతా తమతమ ప్రాంతాలకు వెళ్లి అసలు నిజాలను ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు.

పెగాసస్ అంశంపై పార్లమెంట్ ను కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్, ప్రధాని మాట్లాడే సమయంలోనూ కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. ఆ పార్టీకి తోడు మిగతా విపక్షాలూ జతకలిసి పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగనివ్వట్లేదు. ఇవాళ కూడా రాజ్యసభ, లోక్ సభలు మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడ్డాయి. పెగాసస్ అంశంపై రాజ్యసభ వెల్ లోకి తృణమూల్ ఎంపీ దూసుకెళ్లారు.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా , ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఢిల్లీలో బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశమైంది. ఈ స‌మావేశానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, ప్ర‌హ్లాద్ జోషి, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, ఇత‌ర బీజేపీ నేత‌లు హాజ‌ర‌య్యారు.

Related posts

మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కవితకు 91 సీఆర్పీసీ కింద నోటీసులు!

Drukpadam

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి!

Drukpadam

టీడీపీ ,జనసేన పొత్తు … 60 సీట్లు కావాలంటున్న జనసేన…?

Drukpadam

Leave a Comment