టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) డైరీ ని ఆవిష్కరించిన కలెక్టర్
— యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులకు అభినందనలు
ఖమ్మం :
టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ రూపొందించిన డైరీలను ఖమ్మం జిల్లా కలెక్టర్ దురుశెట్టి అనుదీప్ శనివారం ఖమ్మం లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. డైరీ ఆవిష్కరణ సందర్భంగా నాయకులకు, జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు. యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, సామినేని మురారి, జాతీయ కమిటీ సభ్యులు నలజాల వెంకటరావు, జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మైస పాపారావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మామిడాల భూపాల్, కార్యదర్శి మహేందర్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్, నంచర్ల జనార్ధన చారి, జిల్లా కోశాధికారి నాగండ్ల శివ, జిల్లా నాయకులు ఏగినాటి మాధవరావు, ఏలూరి వేణుగోపాలరావు, పసుపులేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

