ఆఫ్ బీట్ వార్తలు

భారీ హిమపాతంలో వివాహ వేడుక.. !

  • రుద్రప్రయాగ్ లోని శివపార్వతుల వివాహం జరిగిన చోట ఒక్కటైన జంట
  • మీరట్ నుంచి ఉత్తరాఖండ్ కు వధూవరుల కుటుంబాలు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

వివాహ వేడుకను సంప్రదాయబద్ధంగా, స్పెషల్ గా జరుపుకోవాలని భావించిన మీరట్ కు చెందిన జంట రుద్రప్రయాగ్ లోని ఓ ఆలయాన్ని వేదికగా ఎంచుకుంది. ఏర్పాట్లన్నీ చేసుకుని కుటుంబాలతో సహా ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ కు చేరుకుంది. అయితే, కొన్నిరోజులుగా ఉత్తరాఖండ్ లో హిమపాతం కారణంగా ఎక్కడ చూసినా తెల్లటి మంచు తప్ప మరేమీ కనిపించడంలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకోవాలని బంధువులు సూచించినా ఆ జంట వినిపించుకోలేదు. “మంచు కురిసే వేళలో…” అని పాడుకుంటూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

ఈ వివాహానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వధూవరులు ఇద్దరూ మంచులో నడుస్తూ ఆలయానికి వెళ్లడం ఇందులో కనిపిస్తోంది. కాగా, వసంత పంచమి రోజు రుద్ర ప్రయాగ్ లోని త్రియుగినారాయణ్ టెంపుల్ లో ఈ వివాహం జరిగింది. పురాణాల ప్రకారం ఇక్కడే శివపార్వతుల వివాహం జరిగింది. ప్రతికూల వాతావరణంలో వివాహం చేసుకున్న ఆ జంట స్పందిస్తూ.. ఎట్టకేలకు తమకు ఆ పరమశివుడి ఆశీస్సులు లభించాయని సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

ఫిబ్రవరిలో తగ్గిన మాంసాహార, శాకాహార భోజనం ఖర్చులు!

Ram Narayana

నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌ బాస్… చిరుత‌కే చుక్క‌లు చూపించాడుగా…!

Ram Narayana

అతను 180 మంది పిల్లలకు తండ్రి.. ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట!

Ram Narayana