తెలంగాణ వార్తలు

ఏబీఎన్ ఛానల్ ,న్యూస్ ను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ యస్ ప్రకటన ..

  • ఏబీఎన్ ఛానెల్ చర్చల్లో పాల్గొనబోమని బీఆర్ఎస్ ప్రకటన
  • ఎమ్మెల్సీ రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ప్రతినిధి తీరుపై నిరసన
  • పార్టీ కార్యాలయాల్లోకి ఏబీఎన్, ఆంధ్రజ్యోతికి ప్రవేశం లేదని స్పష్టం
  • గతంలోనూ ఆంధ్రజ్యోతి వైఖరిపై బీఆర్ఎస్ ఆరోపణలు

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలను బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏబీఎన్ ఛానెల్‌లో జరిగే చర్చా కార్యక్రమాల్లో తమ పార్టీ నేతలు పాల్గొనరని, అలాగే తమ పార్టీ కార్యాలయాల్లోకి ఆ సంస్థ ప్రతినిధులను అనుమతించబోమని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ తన ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే రాష్ట్ర నాయకత్వం పట్ల ఆంధ్రజ్యోతి అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఉందని కూడా పార్టీ ఆరోపించింది.

ఈ నేపథ్యంలోనే పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌తో పాటు, జిల్లా కార్యాలయాల్లో జరిగే సమావేశాలకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఛానెల్ ప్రతినిధులను అనుమతించరాదని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో బీఆర్ఎస్, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మధ్య వివాదం మరింత ముదిరినట్లయింది.

Related posts

‘యే దేశ్ మేరే’ అంటూ…త్రివర్ణపతాకాలతో ట్రయంఫ్ బైక్‌పై పాతబస్తీలో అసదుద్దీన్ ఒవైసీ…

Ram Narayana

కాంగ్రెస్‌తో చర్చలు చివరి దశకు? రెండు రోజుల్లో ఢిల్లీకి షర్మిల!

Drukpadam

టీఆర్ ఏసీబీ విచారణ… వీడియో, ఆడియో రికార్డింగ్ కు అనుమతించని హైకోర్టు!

Ram Narayana