తెలంగాణ రాజకీయ వార్తలు ..

మంత్రుల భేటీపై పిచ్చి రాతలు ,పిచ్చి భ్రమలు ..డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

ప్రజా భవన్ లో మంత్రుల భేటీపై పిచ్చిరాతలు ,పిచ్చి భ్రమలు అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కఇటీవల కొన్ని పత్రికల్లో ఛానల్స్ లో వస్తున్న వార్తలపై మరోసారి ఫైర్ అయ్యారు .. బుధవారం ఆయన మధిర నియోజకవర్గం కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. మంత్రులు డిప్యూటీ సీఎం ను కలవకూడదా..? సీఎం లేనప్పుడు సమస్యలు చేర్చినందుకు కొందరు మంత్రులు వచ్చి కలిస్తే పిచ్చి రాతలు రాయడమేంటి ..మంత్రులు ఎవరిని కలవాలి రాసేవారినా ..? లేక చూపించేవారిని కలవాలా ..? ఏమిటి అర్ధం పర్థం లేని రాతలు. అన్ని విషయాలు సీఎం తో చర్చించా ..మా క్యాబినెట్ అంతా ఉమ్మడి కుటుంబంలా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది ..ఏవో ఉద్దేశంలో పెట్టుకొని ఎవరికో మేలు చేసేందుకు చేస్తున్న ప్రచారంలా ఉంది ..ఇది కరెక్ట్ కాదు ..తెలియక లేక సమాచారం సరిగా లేక రాసారని వాటిని సరిదిద్దుకుంటారని ఆశించా కానీ అది జరగలేదు ..బొగ్గు టెండర్లు మంత్రికి ఏమి సంబంధం ..దానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్గిన సంస్థ ఉంది .అది చూసుకుంటుంది .సైట్ విజిట్ కూడా 2018 పెట్టిందే కొత్తగా మేము పెట్టింది కాదు . ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడటం జరగని దాన్ని జరిగినట్లు చెప్పడం సమర్థనీయం కాదన్నారు ..సింగరేణి టెండర్ల అంశంలో పూర్తి ఆధారాలతో స్పష్టత ఇచ్చాను, ఇంకా అందులోనే తిరుగుతాను అంటే వాళ్ళ కర్మ చేసేది ఏమిలేదు ..

మున్సిపాలిటీలోనూ అత్యధిక స్థానాలు గెలుస్తాం రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాం
ఎమ్మెల్యేలు అందరూ మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి .నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసాం.దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల అంశం పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారు. మా క్యాబినెట్ అంతా ఉమ్మడి కుటుంబంలో పనిచేస్తుంది రాష్ట్ర భవిష్యత్తు మా అందరి లక్ష్యం .ప్యూర్, క్యూర్, రేర్ సమగ్ర విధానంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం 2017 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశాం.

సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అత్యధిక స్థానాలు గెలుపొందేమో మున్సిపాలిటీలో సైతం అదే విధంగా పెద్ద సంఖ్యలో స్థానాలు గెలుచుకొని రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీల ఎన్నికలకు తెరలేచిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, పట్టణ ఇన్చార్జులు అంతా సమిష్టిగా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉన్న అభ్యర్థులు, కాంగ్రెస్ భావజాలం తెలిసిన, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళగలిగే వారిని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఎమ్మెల్యే లందరూ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని మున్సిపాలిటీలోని పార్టీ ఇన్చార్జిలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నగరాల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తుందని ప్రధానంగా ఆరోగ్యం, విద్య పైన దృష్టి కేంద్రీకరించి ముందుకు వెళుతుందని తెలిపారు. తెలంగాణ పునాది, భవిష్యత్తు అంతా విద్య పైనే ఆధారపడి ఉందని క్యాబినెట్ మొత్తం భావిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సన్న బియ్యం, మహిళలను మహాలక్ష్మి లుగా భావిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు చొప్పున వెచ్చిస్తున్నామని, ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షల పెంచామని పేద కుటుంబాల్లో భరోసా నింపామని తెలిపారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నిర్వహించని గ్రూప్ వన్ పరీక్ష ను ప్రజా ప్రభుత్వం నిర్వహించడమే కాదు ఫలితాలు సైతం వెల్లడించి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా గ్రూప్ 2 సైతం పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.
తెలంగాణ తలరాత విద్య పైనే ఆధారపడి ఉందని నిర్ణయించి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ను ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున నిర్మిస్తున్నామని తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల పెట్టుబడితో ఒక్కో పాఠశాలను సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నామని వివరించారు.

నగరాల్లో మౌలిక సదుపాయాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందని భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. రేర్, క్యూర్ ప్యూర్ సమగ్ర విధానంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గ్లోబల్ సమ్మిట్ లో 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామని తెలిపారు.
గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు విచ్చేసి విజయం డాక్యుమెంట్ ను అభినందించారని తెలిపారు.

కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీలో సేవల రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్యూర్ వెరీ అర్బన్ రీజినల్ ఎకానమీలో అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. రేర్ రూరల్ అగ్రికల్చర్ ఎకానమీలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం, రైతులు ఉత్పత్తి చేసిన వస్తువులకు విలువలను జోడించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులకు సంబంధించిన అంశాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సింగరేణిలో టెండర్లకు సంబంధించిన అంశంపై స్పష్టంగా పూర్తి ఆధారాలతో రాష్ట్ర ప్రజలందరికీ వివరించారు అయినా వారు అందులోనే తిరుగుతాను అంటే ఇక వాళ్ళ కర్మ అని డిప్యూటీ సీఎం అన్నారు.

Related posts

మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందంటున్నారు: డీకే అరుణ..

Ram Narayana

పార్టీ ఫిరాయింపుల వ్యవహారం .. పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు !

Ram Narayana

బర్రెలక్క ప్రచారానికి యానాం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రూ. లక్ష సాయం

Ram Narayana