తెలంగాణ వార్తలు

మేడారం జనజాతర …పోటెత్తిన వాహనాలు…

మేడారంలో లక్షలాది మంది భక్తుల రాకతో వనమాట జనంగా మారింది .తెలంగాణ నుంచేకాకుండా ఛత్తీస్ ఘడ్ , మహారాష్ట్ర ,మధ్య ప్రదేశ్ ,ఆంధ్రప్రదేశ్ కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు ..దీంతో వాహనాలు పోటెత్తాయి..అక్కడ అక్కడ ట్రిఫిక్ జాంలు తప్పలేదు .5 వేల మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారు ..గురువారం కీలక ఘట్టం కావడంతో ఒక్కరోజే 80 మందికి పైగా భక్తులు వచ్చారని అంచనా ..ఇక వివి ఐ పి లతాకిడి పెరిగింది ..కేంద్రమంత్రులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు , ఎంపీలు ఎమ్మెల్సీలు ,ఉన్నతాధికారులు , వానదేవతలను దర్శించుకునేందుకు క్యూకట్టారు .


మేడారంలో వనవదేవతలను దర్శించుకున్న కేంద్రమంత్రులు ఓరా, కిషన్ రెడ్డి…. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబసమేతంగా వచ్చి వానదేవతలను దర్శించుకున్నారు .. ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసమేతంగా వచ్చి దేవతలను దర్శించుకున్నారు ..స్వయంగా టు వీలర్ నడుపుతూ భక్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ..సీతక్క ఇక్కడ మకాం వేసి అన్ని తానై వ్యవహరిస్తున్నారు …దేవదాయశాఖామంత్రి కొండా సురేఖ సైతం మేడారంలో ఉన్నారు

చిలుకల ‘గుట్టు’ ఇదే..

సమ్మక్క కొలువైంది వీటిలోనే…

మేడారం జాతరలో కీలక ఘట్టం చిలుకలగుట్ట పై నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకరావడం. అసలు అక్కడి నుంచి వడ్డెరలు (పూజారులు) ఏమి తీసుకవస్తారనేదొక దేవరహస్యం. కుంకుమ భరణిలో కొలువైన అమ్మవారిని తీసుకోస్తారనేది మనందరికి తెలిసిన విషయమే. అదే కాకుండా మనకు ప్రత్యక్షంగా కనిపించే గద్దెలు. పులి, జింకల మీద స్వారీ చేసే అమ్మవార్ల ఉహజనీత చిత్రాలు. ఇంతకు సమ్మక్క కొలువైన కుంకుమ భరణి ఎలా ఉంటుంది? చిలుకల గుట్ట పై మనకు తెలియని మరేమైనా నిగూఢంగా ఉంటాయా? అనే సందేహం భక్తులకే కాకుండా ప్రతి ఒక్కరికీ కలగడం సహజమే. ఈ సందేహం మాకు (ఆంధ్రభూమి) కూడా వచ్చింది. ఆ రహస్యమేదో కనిపెట్టాలని 2004 జాతరకు ముందు ప్రయత్నించాం.మేడారంలో సమ్మక్క పూజారులను ఒప్పించి, జాతరకురాని భక్తులకు కనీసం సమ…

అశేష భక్తజనవాహిని నడుమ, తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సతీసమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క-సారలమ్మల గద్దెల వద్ద భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించి, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం వెంట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

దర్శనం అనంతరం జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లను డిప్యూటీ సీఎం స్వయంగా పర్యవేక్షించారు.

జాతర ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి భద్రత, క్రమశిక్షణ, సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీరు, రవాణా, క్యూలైన్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో అన్ని చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు అమ్మవార్ల దర్శనం సురక్షితంగా, సులభంగా జరిగేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గారు స్పష్టం చేశారు.

మేడారంలో వనవదేవతలను దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు…


మేడారం చిలకలగుట్ట నుండి. 6 గంటల..15 నిమిషాలకు గద్దెల మీదకి బయలు దేరిన సమ్మక్క…,

గాలిలోకి కాల్పులు జరిపి స్వాగతం పలికిన ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్….

మేడారం జ‌న‌సంద్రం రెండో రోజూ జాత‌ర‌కు పోటెత్తిన భ‌క్త జ‌నం… ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు…పుణ్య‌స్నానాల‌తో జ‌న‌సంద్రంగా జంపన్న‌వాగు.. శివ‌స‌త్తుల పూన‌కాల‌తో మార్మోగుతున్న వ‌నంవిందు..వినోదాల‌తో సేద‌తీరుతున్న భ‌క్తులు…అలారారుతున్న ఆదివాసీ,గిరిజ‌న ఆధ్యాత్మిక సంస్కృతిజాత‌ర… స‌మాహారంపై కాక‌తీయ ప్ర‌త్యేక చిత్ర‌మాలిక‌…

మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మేడారంలో మీడియాతో మంత్రి గారు మాట్లాడుతూ.. ఈరోజు దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలివస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

మేడారం జాతర శాశ్వత అభివృద్ధి కోసం ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరో 41 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. మొత్తంగా సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఈ ప్రాంతంలో శాశ్వతంగా కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, మరిన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించనున్నట్లు వివరించారు.

దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ప్రాధాన్యతను మరింత పెంచేందుకు బాసర నుంచి భద్రాచలం వరకు రూ.2,500 కోట్ల వ్యయంతో టెంపుల్ సర్క్యూట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధిలో మేడారం ఆలయాన్ని కూడా భాగంగా చేర్చనున్నట్లు ఆయన ప్రకటించారు.

జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం రామప్ప–లక్నవరం–జంపన్న వాగు వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని, వాగుపై చెక్‌డ్యామ్‌లు నిర్మించి శాశ్వత నీటి నిల్వకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.

మేడారం ప్రాంతానికి ఇప్పటికే ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని, దాని ప్రకారం అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కుల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.

సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండు రోజుల్లోనే 70 నుంచి 80 లక్షల మంది భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో అత్యంత తక్కువ సమయంలో ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

గతంలో ఇరుకైన రోడ్ల కారణంగా ఇబ్బందులు ఉండేవని, ఈసారి ఫోర్-లేన్ రోడ్లతో రాకపోకలు చాలా సులభమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో శాశ్వత తాగునీటి వ్యవస్థతో పాటు భారీ సంఖ్యలో శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా చెట్ల పెంపకం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

జాతర విజయవంతానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగం మరియు మీడియా మిత్రులకు సీతక్క అభినందనలు తెలిపారు.

శనివారం సాయంత్రం 4 గంటలకు తల్లులు గద్దెల నుంచి తిరిగి వనప్రవేశం చేయనున్నారని, అప్పటివరకు భక్తులు ఓపికతో దర్శనాలు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Related posts

ఆ రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు: తుమ్మల నాగేశ్వరరావు!

Ram Narayana

కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. సింగరేణిపై తెలంగాణ‌ ప్రభుత్వం వ‌రాల జ‌ల్లు…

Ram Narayana

కేటీఆర్… ఇంత విధ్వంసం జరుగుతుంటే సమీక్ష చేసే టైమ్ లేదా?: రేవంత్ రెడ్డి

Ram Narayana