ఆంధ్రప్రదేశ్

అంబటి రాంబాబు అరెస్టుపై వైసీపీ శ్రేణుల ఆగ్రహం…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పగలు ప్రతీకారాలతో రగిలి పోతున్నాయి..అంతకు ముందు జగన్ ప్రభుత్వం ,ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే దారిలో నడుస్తున్నాయి…ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ..ఒకరికి మరొకరు ఎదురు పడితే కత్తులతో పొడుచుకుంటారా అన్నంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి..ఒకరి రైటు మరొకరిది రాంగ్ అని చెప్పడానికి వీల్లేని విధంగా ఉంది .నిన్న గుంటూరు లో అంబటి రాంబాబు వర్సెస్ టీడీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి…బూతులు తిట్టుకున్నారు …చివరకు అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేసి ఇంటి ముందు ఉన్న కారును ధ్వంసం చేశారు ..ఇంటి అద్దాలు పగల గొట్టారు ..పోలీసులు ఉన్న చేష్టలుడిగి చూశారు తప్ప ఎవరిపైన చర్యలు తీసుకోలేదని వైసీపీ విమర్శిస్తోంది …ఇక అంబటి సైతం తాను ఏమి తక్కువ తినలేదన్నట్లుగా తిట్లపురాణం లంకించుకున్నారు ..ఇదేమి అని అడిగితె తనపై దాడికి కర్రలు రాడ్లతో వస్తే తిట్టినా మాట వాస్తవమేనని సీఎం చంద్రబాబు పేరు కూడా ఆ సందర్భంగా ప్రస్తహించానని కానీ తిట్టింది ఆయన్ను కాదనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు . టీడీపీ మాత్రం చంద్రబాబును తిడతావా ఆయనకు క్షమాపణ చెప్పు లేకపోతె నిన్ను వదిలిపెట్టమని అంటుంది ..ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుందా ..?లేక సర్దుకుంటుందా ..అనే దానిపై ఆసక్తి నెలకొన్నది ..జగన్ అధికారంలో ఉండగా పట్టాభి అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని బోసిడికే అని తిట్టిన తిట్లను వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.. మరి ఈ సంఘటనలు ఎటు దారితీస్తాయో చూడాలి ..

అంబటి రాంబాబు అరెస్ట్

Ambati Rambabu Arrested for Remarks Against Chandrababu Naidu
  • సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి అరెస్ట్
  • టీడీపీ నేత బాజీ చౌదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
  • అంబటి ఇంటి వద్ద 6 గంటలకు పైగా టీడీపీ శ్రేణుల నిరసన, ఆందోళన
  • తీవ్ర ఉద్రిక్తతల మధ్య అంబటిని వజ్రవాహనంలో తరలించిన పోలీసులు
  • అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ మంత్రులు, నేతలు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని నవభారత్ నగర్ లోని నివాసం నుంచి ఆయనను తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసు వాహనంలోకి ఎక్కించి తరలించారు.

వివరాల్లోకి వెళితే, గుంటూరులో తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందంటూ టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదంపై స్పందిస్తూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్రమైన, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరులోని అంబటి నివాసం వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. దాదాపు 6 గంటలకు పైగా నిరసన కొనసాగింది. ఈ క్రమంలో ఆయన ఇంటిపై రాళ్లు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ప్రత్యేక వజ్రవాహనంలో అక్కడి నుంచి తరలించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అంబటి వ్యాఖ్యలను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, హోం మంత్రి అనిత, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. అంబటి వ్యాఖ్యలు ‘దుర్మార్గం’, ‘నీచం’ అని అభివర్ణిస్తూ, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు అర్ధాంగి విజయలక్ష్మి

Vijayalakshmi approaches High Court over illegal detention
  • హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన అంబటి రాంబాబు భార్య
  • తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపణ
  • శాంతిభద్రతలు విఫలమయ్యాయని, రక్షణ కల్పించడం లేదని పిటిషన్‌లో వెల్లడి
  • తనకు 24 గంటల భద్రత కల్పించాలని కోర్టును కోరిన విజయలక్ష్మి

మాజీ మంత్రి అంబటి రాంబాబు అర్ధాంగి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనతో పాటు సుమారు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ ఆమె ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

వివరాల్లోకి వెళితే, తాడేపల్లిలో పోలీసులు తనను, తనతో ఉన్నవారిని అక్రమంగా నిర్బంధంలో ఉంచారని విజయలక్ష్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని, తనకు భద్రత కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆమె ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తనకు, తన కుటుంబానికి రక్షణగా 24 గంటల పాటు పోలీసు భద్రతను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. పోలీసులు తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని, ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపాల్సి ఉంది.

Related posts

జగన్ కాచుకో …కేంద్రంతో ఒక ఆటాడిస్తా ….విశాఖ సభలో పవన్ ఫైర్ ….!

Ram Narayana

నిత్యజీవితంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే విష పదార్థాలు ఇవే!

Drukpadam

సంచలనంగా మారిన సుప్రీం మాజీ జడ్జిల ,బ్యూరోక్రాట్లు బహింరంగా లేఖ!

Drukpadam