క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

ఫోన్ నంబర్ ‘బ్లాక్’ చేశాడని దారుణం.. ప్రియుడిని కత్తితో పొడిచి చంపిన యువతి!

  • సోషల్ మీడియా పరిచయం.. హత్యకు దారి
  • ఫోన్ నంబర్ బ్లాక్ చేయడమే వివాదానికి కారణం
  • నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బిలాస్‌పూర్‌లో సంచలనం సృష్టించిన ఘటన

కేవలం ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడన్న చిన్న కారణం ఒక యువకుడి ప్రాణం తీసింది. మనస్పర్థల నేపథ్యంలో తన నంబర్‌ను బ్లాక్ చేసిన ప్రియుడిని, ఒక యువతి కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. ప్రసాద్ సూర్యవంశీ (25) అనే యువకుడు స్థానిక టీచర్స్ కాలనీలో నివసిస్తూ ఒక హోటల్‌లో పనిచేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక యువతితో అతనికి ప్రేమ వ్యవహారం ఉంది. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రసాద్ తన ప్రియురాలి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు.

ఫోన్ నంబర్ ఎందుకు బ్లాక్ చేశావని నిలదీయడానికి ఆమె ప్రసాద్ ఇంటికి వెళ్లింది. అతడి మొబైల్‌లోని చాటింగ్ వివరాలు చూపించాలని పట్టుబట్టింది. ప్రసాద్ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఆమె, వెంట తెచ్చుకున్న కత్తితో అతడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న బిలాస్‌పుర్ ఎస్పీ రజనీశ్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. “నిందితురాలిని విచారిస్తున్నాం, హత్యకు గల పూర్తి కారణాలను త్వరలోనే వెల్లడిస్తాం” అని ఎస్పీ తెలిపారు. 

Related posts

పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్…

Ram Narayana

అయోధ్య రామమందిరానికి మొదటి బంగారం తలుపు ఏర్పాటు

Ram Narayana

డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి.. సీఎం ఫడ్నవీస్‌కు ప్రధాని మోదీ, అమిత్ షా ఫోన్…

Ram Narayana