ఎంటర్టైన్మెంట్ వార్తలు

జర్నలిస్టుని బెదిరించిన హీరో చంద్ర హౌస్.. కేసు నమోదు

Chandrahas Booked for Threatening Journalist in Madhapur
  • వేదికపై అసభ్యకరంగా పాట పాడిన నటుడు చంద్రహాస్
  • భాష సరికాదన్న జర్నలిస్టుపై ఇన్‌స్టాలో బెదిరింపులు
  • వేదికపై అసభ్యకరంగా పాట పాడిన నటుడు చంద్రహాస్
    భాష సరికాదన్న జర్నలిస్టుపై ఇన్‌స్టాలో బెదిరింపులు

    ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, యువ నటుడు చంద్రహాస్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. తన సినిమా ప్రమోషన్ వేదికగా అసభ్యకర పాట పాటపాడటమే కాకుండా, దానిని ప్రశ్నించిన ఒక సీనియర్ జర్నలిస్టును సోషల్ మీడియా వేదికగా బెదిరించడంతో ఆయనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.

    చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై చంద్రహాస్ అసభ్య పదజాలంతో కూడిన పాటను పాడారు. ఒక నటుడిగా సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా అని ప్రశ్నిస్తూ ‘బిగ్ టీవీ’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కుమార్ ఒక వీడియోను విడుదల చేశారు. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు వివరణ ఇవ్వాల్సింది పోయి, చంద్రహాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ జర్నలిస్టును హెచ్చరిస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ వీడియో పోస్ట్ చేశారు.

    ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అశోక్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి ఫిర్యాదు మేరకు చంద్రహాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సినిమా ప్రచారంలో భాగంగా విభిన్నంగా ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ, అది సభ్య సమాజం తలదించుకునేలా ఉండకూడదని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తన బాడీ లాంగ్వేజ్, మాటతీరుతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న ఈ యువ హీరోకు, ఈ తాజా కేసు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది. 

Related posts

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ – మూవీ రివ్యూ!

Ram Narayana

విజయ్-రష్మిక పెళ్లి: అతిథులకు జపనీస్ విందు.. నో ఫోన్ పాలసీ!

Ram Narayana

2024లో అత్య‌ధిక ప‌న్ను చెల్లించిన సెల‌బ్రిటీలు వీరే.. టాప్‌లో ఎవ‌రంటే..!

Ram Narayana