తెలంగాణ వార్తలు

జిల్లా మండల పరిషత్ ఎన్నికలకు ఎస్ ఎస్ సి ,ఇంటర్మీడియట్ పరీక్షలు అడ్డంకి …

జిల్లా మండల పరిషత్ ఎన్నికలకు ఎస్ ఎస్ సి ,ఇంటర్మీడియట్ పరీక్షలు అడ్డంకి …
మార్చిలో ఎన్నికల ఆలోచన మరికొంతకాలం వాయిదా ..
రైతు భరోసా నిధులు ఖాతాల్లో వేసి ఎన్నికలకు…

రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ఎస్సెస్సీ ,ఇంటర్మీడియట్ పరీక్షలు అడ్డంకిగా ఉన్నాయని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది … మునిసిపల్‌ ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగితే .. అదే ఊపులో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నప్పటికీ విద్యార్థులు పరీక్షలు వల్ల కొంత కాలం వాయిదా వేయాలనే ప్రభుత్వం పెద్దలు ఉన్నారు .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఎన్నికలు జరగకపోతే జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. పరిషత్‌ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ అదికుదిరేలా కనిపించడంలేదు .. బడ్జెట్‌ సమావేశాలకు ముందే ప్రభుత్వం పరిషత్‌ ఎన్నికలకు వెళ్లే ఉన్న అవకాశాలను అధికారపార్టీ పరిశీలించిన సమయం సరిపోయేలా లేదు .. రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిశాక ఈ నిధులను రైతుల ఖాతాల్లో వేసి.. ఆ తరువాత పరిషత్‌ ఎన్నికలకు వెళ్లనున్నట్లు చెబుతున్నాయి. మార్చిలో రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది .. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన వరుస ఎన్నికల్లో ఆ పార్టీకి సానుకూల ఫలితాలే వస్తున్న సంగతి తెలిసిందే.

Related posts

ప్రజాప్రభుత్వాన్ని దీవించండి … పార్టీ అభ్యర్థులను గెలిపించండి…మంత్రి పొంగులేటి

Ram Narayana

కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు!

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టికెట్స్ ఆశిస్తున్నవారి జాబితా …!

Drukpadam