తెలంగాణ వార్తలు

నికార్సైన కమ్యూనిస్టుని,ఎమ్మెల్యే పోస్ట్ కోసం తలవంచను…ప్రభుత్వంపై కూనంనేని ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షమైన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ,ప్రత్యేకించి తన సొంత నియోజకవర్గమైన కొత్తగూడెంలో ఇప్పటివరకు తనకు తనకు తన పార్టీకి జరుగుతున్నా అవమానాలపై మౌనం వీడారు…ఇంతకాలం తన మౌనం కేవలం ముఖ్యమంత్రి గారి కోసమేనని అన్నారు .కానీ నన్ను పనిచేయనివ్వడంలేదు ..అవమానాలు జరుగుతున్నాయి..మా కార్యకర్తలకు , సామాన్యప్రజల్ను ,పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు …నేను నికార్సైన కమ్యూనిస్టును తల ఎత్తుకోవడమే తప్ప వంచడం జరగదు ..మిత్రపక్షం అనుకుంటే, శత్రువుకన్నా ఎక్కువగా చూస్తున్నారు ..పనిచేయనివ్వడంలేదు ..కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు ..ఎంతకాలం ఓపిక పడతాం ..ఇక ఓపిక లేదు .. ఎమ్మెల్యేగా చేయనిస్తున్నారా ..?ఇది ఎక్కడైనా ఉందా ..?ఇక సహించం .. అవమానాలను భరించలేను ..మా మార్గాల్లో మేము ప్రజలను సమీకరిస్తాం …పోరాటాలు చేస్తాం అని సాంబశివరావు ప్రభుత్వ చర్యలపై మొదటిసారిగా తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు ..

నన్ను ఇబ్బంది పెడతారా …ఇప్పటివరకు గరళం తాగిన శివుడిలాగా ఉన్నాను … నేను పిల్లని కాదు ..పులిని .. కేవలం ముఖ్యమంత్రి గారికోసమే మౌనంగా ఉన్నాను ..ఇష్టం వచ్చినట్లు చేస్తారా…? ఇక ఓపిక లేదు .. నన్ను ఇబ్బంది పెడతారా …అంత కడుపులో పెట్టుకొని ఉన్నాను …అదే చెపుతున్నాను …ఇదే ఆఖరి రోజు … మా జోలికి ఎవరు వచ్చిన చర్యలు తీసుకోవాలి .. ప్రజల మీద ,అమాయక ప్రజల మీద దౌర్జన్యం చేస్తే ఉర్కొం ..పోలీసులకు కూడా చెపుతున్నాను … మా కార్యకర్తల జోలికి రావద్దు… వస్తే మాకు ఉన్న ఆయుధం యుద్ధం … ఇక యుద్ధం మొదలవుతుంది … వ్యక్తిగత ప్రయోజనాల కోసం తలవంచను .. అసలు సిసలైన కమ్యూనిస్టును ..అలాగే బతికాను ..నేను పిల్లిని కాదు పులిని ..ఇక ఓపిక లేదు ..ఇదెక్కడి న్యాయం ఎక్కడైనా ఉందా… ఎమ్మెల్యేగా చేయనివ్వడం లేదు .. ఈ పద్దతి ఎం పద్దతి అంటూ తనకు జరుగుతున్నా అన్యాయాలు,అవమానాలపై ఏకరువు పెడుతూ నిప్పులు చెరిగారు ..ఇక యుద్ధం మొదలవుతుందని హెచ్చరించారు ..

కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న సిపిఐ ఇక దూరమవుతుందా ..? అంటే కూనంనేని మాటలు అవుననే చెపుతున్నాయి…ఇప్పటివరకు అవమానాలు భరించాను ఇక భరించేది లేదని ఇదే ఆఖరి రోజు ..ఇప్పటివరకు ముఖ్యమంత్రిగారికోసమే మౌనంగా ఉన్నానని అన్నారు .ఇక భరించలేమని తేల్చి చెప్పారు …ఎమ్మెల్యేను పనిచేయనివ్వడంలేదు ..ఇదెక్కడి పద్దతి ఎక్కడైనా ఉందా ..అంటూ నిలదీశారు ..ఇక పోరాటమే మార్గమన్నారు ..దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి ..!

Related posts

భట్టి చొరవతో యాదాద్రికి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు…

Ram Narayana

సౌదీలో తెలుగు వ్య‌క్తి అనుమానాస్పద మృతి!

Ram Narayana

తన కుమార్తెను అంగన్‌వాడీలో చేర్చిన ఆదిలాబాద్ కలెక్టర్!

Ram Narayana