Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైఎస్ షర్మిలకి షాక్.. సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు

రాజన్న రాజ్యం పార్టీలో అప్పుడే మొదలైన రాజీనామాలు
-పార్టీ లో పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు
-ఈ విషయాలు షర్మిలకు తెలియకపోవచ్చన్ననర్సింహా రెడ్డి 
-కొంత మంది పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజం
-రాఘవరెడ్డి వ్యవహారశైలిపై ప్రతాప రెడ్డి విమర్శలు …రాజీనామా

రాజన్న రాజ్యం తెచ్చేవరకూ పోరాటం చేస్తామంటూ వైఎస్ షర్మిల అట్టహాసంగా ప్రారంభించిన పార్టీలో అప్పుడే అంతర్గత పోరు మొదలైంది. పదవులు అమ్ముకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత పార్టీ నేత.

ఆదిలోనే హంసపాదు ఎదురైందన్నట్టు!! అప్పుడే పెట్టిన పార్టీలో అంతర్గత పోరు విస్మయానికి గురిచేస్తోంది. పార్టీ బలోపేతం సంగతి పక్కన పెడితే నేతల కుమ్ములాటలు అధినేత్రికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. వైఎస్ షర్మిల నూతన పార్టీ వైఎస్సార్‌టీపీలో అప్పుడే అంతర్గత పోరు మొదలైంది. పదవులు అమ్ముకుంటున్నారంటూ కీలక నేత పార్టీ కార్యాలయంలో రచ్చ చేయడం చర్చనీయాంశంగా మారింది. షర్మిల పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారంటూ దేవరకద్రకి చెందిన నర్సింహా రెడ్డి ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పార్టీ పదవులు 5 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని.. రాత్రికి రాత్రే పేర్లు మార్చేశారంటూ నర్సింహా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను షర్మిలను వ్యతిరేకించడం లేదని.. కానీ పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ముక్కూమొహం తెలియని వాళ్లకి పదవులెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో పదవులు ఎవరు అమ్ముకుంటున్నారో తనకు తెలుసని.. పదవులు అమ్ముకుని పార్టీని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లారని ఆయన మండిపడ్డారు. తాగుబోతులకు పదవులు అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాఘవరెడ్డి వ్యవహారశైలికి నిరసనగా ప్రతాప్ రెడ్డి రాజీనామా

వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇటీవలే దూకుదు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. అన్ని జిల్లాల్లో పర్యటించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీకి చేవెళ్ల ప్రతాప్ రెడ్డి రాజీనామా చేశారు.

పార్టీ నేత రాఘవరెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయన రాజీనామా చేయడం పార్టీలో అంతర్గతంగా కలకలం రేపుతోంది. పార్టీలో అప్పుడే ఆధిపత్య పోరు మొదలైందని కొందరు అంటున్నారు.

 

Related posts

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై ఈడీ కొరడా…భగ్గుమన్న రౌత్

Drukpadam

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ యస్ సిట్టింగ్ లలో ఉండేదెవరు, ఊడేదెవరు ….?

Drukpadam

అథ్లెట్లకు వీడియో కాల్స్ చేసింది చాలు.. పాత నజరానాలు చెల్లించండి: రాహుల్ చురకలు!

Drukpadam

Leave a Comment