Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కారుకు లోడ్ ఎక్కువైంది అయింది …వికటించే ప్రమాదం !

కారుకు లోడ్ ఎక్కువైంది అయిందివికటించే ప్రమాదం 
ఇప్పటికే కారెక్కిన అనేక మంది
ఈరోజు కేసీఆర్ సమక్షంలో కారెక్కిన పెద్దిరెడ్డి
పెద్దిరెడ్డి తనకెంతో సన్నిహితుడన్న సీఎం కేసీఆర్
ఇద్దరం ఒకేసారి మంత్రులుగా పనిచేశామని వెల్లడి
ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన పెద్దిరెడ్డి
కేసీఆర్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా శిరసా వహిస్తానని వ్యాఖ్య

టీఆర్ యస్ పార్టీ కారులో లోడు ఎక్కువైంది ….వికటించే ప్రమాదం ఉంది …. ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చేరిన అనేకమంది ముఖ్యనేతలు ఖాళీగా ఉన్నారు. తుమ్మల ,కడియం మొదలు , పోచారం శ్రీనివాస్ రెడ్డి ,పట్నం మహేందర్ రెడ్డి , జోగు రామన్న , తలసాని శ్రీనివాస్ యాదవ్ , నామ నాగేశ్వర్ రావు , నుంచి నేడు పెద్దిరెడ్డి రేపు ,మోత్కపల్లి నరసింహాలు (ఇంకా చేరలేదు) వరకు అందరు తెలుగుదేశం నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం .ఇక కాంగ్రెస్ నుంచి కూడా అనేకమంది కారెక్కారు. సబితా ఇంద్రారెడ్డి ,గుత్తా సుఖేందర్ రెడ్డి , విద్యాసాగర్ రావు , వనమా వెంకటేశ్వర రావు , ఇంద్రకరణ్ రెడ్డి లాంటి అనేక మంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. అందువల్ల కార్ లౌడ్ ఎక్కువైందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకప్పుడు ఉద్యమకారుల పార్టీ … రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెగించి కొట్లాడిన అనేకమంది నేడు తెరమరుగైయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పడు ఫక్తు రాజకీయపార్టీ గా మారింది. తెలంగాణ రాష్త్రం కోసం పోరాడిన వారు కనుమరుగైయ్యారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో వివిధ పార్టీలనుంచి వచ్చిన వారు … తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారు టీఆర్ యస్ లో అధికంగా ఉన్నారని వారే అధికారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ మీద కారాలు మిరియాలు నూరిన అనేకమంది,ఉద్యమానికి అడ్డుపడిన వారు పార్టీలో చేరుతున్నారు. హుజురాబాద్ ఎన్నిక నేపథ్యంలో చేరికలు ఊపందు కున్నాయి. ప్రత్యేకించి హుజురాబాద్ పై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ దళిత బందు పథకం పెట్టారు. దీనిపై అన్ని పార్టీల్లో చర్చ ప్రారంభం అయింది. దీనిని వ్యతిరేకిస్తే దళిత వ్యతిరేకులు అనే ముద్రపడుతుందనే అభిప్రాయంతో వెనకడుగు వేస్తున్నారు. ఒక్కక్క లబ్ది దారుడికి పదిలక్షలు రూపాయలు ఇస్తామని సీఎం ప్రకటించడంతో పథకం మంచిదే కాని ఒక్క హుజురాబాద్ లో అమలు చేయడం ఏమిటి ? రాష్ట్రమంతటా అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

కేసీఆర్ కేవలం ఓట్ల రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలపై కూడా సీఎం స్పందించారు. ఎస్ ఓట్ల కోసమే చేస్తాం … ఇందులో ఏముంది. మేమేమన్న సన్యాసులమా ? మాది రాజకీయపార్టీ రాజకీయాలు చేస్తాం …. ఓట్లకోసమే చేస్తాం ? ఇందులో రహస్యం ఏముంది. అని కుండబద్దలు కొట్టారు. అయితే హుజురాబాద్ లో దళితులను మోసం చేసేందుకే 10 లక్షల సహాయం చేస్తామని సీఎం ప్రకటించారని ఆయన గతంలో చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది …. దళిత ముఖ్యమంత్రి ఏమైయ్యారు…. ఇంటికో ఉద్యోగం ఏమైంది. … ప్రగతి భవన్ ఒక్క దళిత అధికారిని కూడా ఎందుకు లేరు…. ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చి తరువాత కొత్త వాగ్దానాలు చేస్తే బాగుంటుందని అంటున్నారు. జిహెచ్ ఎంసీ ఎన్నికల సందర్భంగా నీట మునిగిన వారికీ ఒక్కక్కరికి 10 వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ,ఎన్నికలు అయినా తరువాత వాటి గురించి పట్టించుకోని విషయాన్నీ గుర్తు చేస్తున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఇటు అధికార టీఆర్ యస్ కు అటు బీజేపీ కి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈటల టీఆర్ యస్ గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ గెలుపు ద్వారా టీఆర్ యస్ తన సత్తా చాటాలని చూస్తుంది.

బీజేపీ టిక్కెట్ ఆశించినమాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇంతకు ముందు కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి టీఆర్ యస్ కండువ కప్పుకున్నారు. అసందర్భంగా ఆయనకు ఇక తిరుగు లేదన్నారు. కాంగ్రెస్ కు చెందిన స్వర్గ రవి అనే బలమైన బీసీ నేతను చేర్చు కున్నారు.

హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, పెద్దిరెడ్డి తనకు ఎంతో సన్నిహితుడని చెప్పారు. తాను, పెద్దిరెడ్డి ఇద్దరూ ఒకే సమయంలో మంత్రులుగా పనిచేశామని తెలిపారు. రైతుబంధు పథకం పక్కాగా అమలవుతోందని చెప్పారు. చేనేత కార్మికులకు రైతు బీమా తరహాలో సహాయం అందిస్తామని తెలిపారు. తెలంగాణను సాధించుకున్న తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఉండేవని… వాటన్నింటినీ అధిగమించామని చెప్పారు.

దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జీగా పని చేసిన పెద్దిరెడ్డి కి హుజూరాబాద్ లో తనను ఇన్ఛార్జీగా నియమించకపోవడం , తనకు చెప్పకుండానే ఈటలను బీజేపీలో చేర్చుకోవడంపై ఆగ్రహంగా ఉన్నారు.. ఈటల రాజేందర్ దేవాలయ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు నిజమని కోర్టులో తేలితే… బీజేపీ ఏం సమాధానం చెపుతుందని పెద్దిరెడ్డి ప్రశ్నిస్తున్నారు.

Related posts

కేసీఆర్‌ కుటుంబమే టార్గెట్‌గా బీజేపీ బ్లాక్‌మెయిల్‌…ఎంపీ వద్దిరాజు

Drukpadam

ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే త్వరలో ప్రారంభం …ఖమ్మం కలెక్టర్ గౌతమ్…

Drukpadam

చట్టాలు, సెక్షన్లు ఇలాంటి సమయంలోనే గుర్తొస్తాయా?: రేణుకా చౌదరి

Drukpadam

Leave a Comment