Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కొండపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లకుండా రేపు ఎలా అడ్డుకుంటారో చూస్తాం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు!

కొండపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లకుండా రేపు ఎలా అడ్డుకుంటారో చూస్తాం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు!
-ఈరోజు అడ్డుకోవడంపై మండిపాటు
-వనరులను దోచుకోవడంలో వైసీపీ నేతలు తలమునకలై ఉన్నారు
-ఎన్జీటీ తీర్పు తర్వాత తవ్వకాలను మరింత ఎక్కువ చేశారు
-రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం, ఎన్జీటీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తాం

కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుందంటూ టీడీపీ చేస్తున్న పోరాటం మరింత ఉదృతం చేసేందుకు టీడీపీ సిద్ధపడుతుంది. మైనింగ్ ప్రాంతానికి వెళ్లేందుకు నిజనిర్దారణ కమిటీని వేర్పాటు చేసిన టీడీపీ అక్కడు వారు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడంతో రాష్ట్రప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ ఈ రోజు తమను అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. రేపు వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారో చేస్తాం అంటూ హెచ్చరికలు చేశారు.

ప్రకృతి వనరులను దోచుకోవడంలో వైసీపీ నేతలు తలమునకలై ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు వైసీపీ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు . ఇసుక, మట్టి, లాటరైట్, బాక్సైట్, సిలికాన్ వంటి అన్నింటిపై అధికార పార్టీ నేతల కన్ను పడిందని అన్నారు. పోలవరం కాలువను కూడా వదలడం లేదని చెప్పారు. అక్రమ మైనింగ్ కొనసాగుతోందని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పే వైసీపీ నేతల దోపిడీకి నిదర్శనమని అన్నారు.

విశాఖ మన్యంలో బాక్సైట్ అక్రమ మైనింగ్ పై పూర్తి నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని అశోక్ బాబు అన్నారు. ఎన్జీటీ తీర్పు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమైనా తవ్వకాలను ఆపేస్తుందని… కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం అక్రమ మైనింగ్ ను ఎక్కువ చేసిందని మండిపడ్డారు.

కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ప్రాంతానికి టీడీపీ వారు వెళ్లకుండా ఈరోజు అడ్డుకున్నారని… కానీ, భవిష్యత్తులో ఎలా అడ్డుకుంటారో చూస్తామని అన్నారు. అక్రమ మైనింగ్ అంతు చూస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలపై కేంద్రానికి, గ్రీన్ ట్రైబ్యునల్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Related posts

సిలిండర్ ధర పెంపుపై భగ్గుమన్న బీఆర్ యస్.. నిరసనలకు పిలుపు ..

Drukpadam

కర్ణాటకలో కాంగ్రెస్ దే హవా… బీజేపీ ఖేల్ ఖతం.. !

Drukpadam

టీడీపీకి 40 వసంతాలు…ప్రత్యేక లోగో ఆవిష్కరించిన చంద్రబాబు!

Drukpadam

Leave a Comment