Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల రాజేందర్ మొకాలుకి ఆపరేషన్.. పాదయాత్ర కొనసాగింపు పై అనుమానాలు !

ఈటల రాజేందర్ మొకాలుకి ఆపరేషన్.. పాదయాత్ర కొనసాగింపు పై అనుమానాలు !
-పాదయాత్ర సందర్భంగా అస్వస్థతకు గురైన ఈటల
-కాలికి నొప్పి రావడంతో ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు
-వారం రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్న ఈటల
-ఆ తరువాతనే పాదయాత్రపై నిర్ణయం
-పాదయాత్ర కొనసాగింపు ఉంటుందా లేదా అనే దానిపై ఉత్కంఠ

ఈటల రాజేందర్ హుజురాబాద్ లో జరగనున్న ఉపఎన్నికకోసం పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసేందే . పాదయాత్రలో అస్వస్థతకు గురైన ఈటల అర్థాంతరంగా పాదయాత్ర నిలిపి వేసి హైద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన రెండుమూడు రోజుల్లో తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారని అందరు భావిస్తుండగా ఆసుపత్రిలో ఆయన కాలుకు నొప్పి రావడంతో పరీక్షించిన డాక్టర్లు , ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పి ఆపరేషన్ చేశారు. ఆయన కోలుకోవాలంటే మరో వారం రోజులపాటు విశ్రాంతి అవసరం అంటున్నారు డాక్టర్లు . తరువాతనే ఆయన ను పరీక్షించి పాదయాత్ర చేయవచ్చునో లేదో చెబుతారు . అప్పటివరకు దీనిపై ఉత్కంఠత కొనసాగుతుంది.

ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది. ఆయన మోకాలికి ఆపరేషన్ జరగటంతో దానిపై ఇప్పుడే ఇమి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు . పాదయాత్ర సందర్భంగా ఈటల అస్వస్థతకు గురై హైద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ . అస్వస్థత నుంచి కోలుకున్న తరుణంలో ఆయనకు కాలునొప్పి వచ్చింది. దీంతో కాలుని పరీక్షించిన వైద్యులు… ఆయన మోకాలికి ఈరోజు ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఈటల ఉండనున్నారు.

పది రోజుల తర్వాత డాక్టర్ల సూచన మేరకు పాదయాత్రను కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయాన్ని ఈటల తీసుకోనున్నారు. ఇప్పటి వరకు ఈటల పాదయాత్ర 12 రోజుల పాటు కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం ఆయన యాత్ర 22 నుంచి 25 రోజుల పాటు కొనసాగాల్సి ఉంది. అయితే పాదయాత్ర నిలిచిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈటల కోలుకున్న తర్వాత ఆయన పాదయాత్ర కొనసాగుందని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి.

Related posts

ఫైజర్ ,మోడర్న్ లు తమ వ్యాక్సిన్లు నేరుగా అమ్మలేమని చెప్పాయి: కేజ్రీవాల్…

Drukpadam

బీజేపీకి డిపాజిట్లు కూడా రావు, అమిత్ షా సభలో ఇందులో సగం లేరు: హరీష్ రావు…

Drukpadam

షర్మిల పార్టీ లోకి ఏపూరి సోమన్న…

Drukpadam

Leave a Comment