Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వివేకా హత్యకేసు… సిబిఐ కి చిక్కిన సునీల్ యాదవ్!

వివేకా హత్యకేసు… సిబిఐ కి చిక్కిన సునీల్ యాదవ్!
– సునీల్‌ యాదవ్ ను గోవాలో నిర్బంధంలోకి తీసుకున్న సీబీఐ
-వాచ్ మెన్ మంగయ్య చెప్పిన ముగ్గురి పేర్లలో సునీల్ యాదవ్
-హైకోర్టు ను ఆశ్రయించి పారిపోయిన సునీల్
-ఆయన పై పెరిగిన అనుమానాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్యోదంతంలో కీలక అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది..

వివేకానంద హత్య జరిగి రెండేళ్లయినా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా నిందితులను పట్టుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని కుటుంబీకులు అనుమానించడం, జగన్ ప్రోద్బలంతోనే వివేకా హత్య జరిగుంటుందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండటం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ కీలక అడుగుగా సునీల్ యాదవ్ ను పట్టుకున్నట్లు

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ముందు నుంచీ కీలక అనుమానితుడిగా ఉన్నాడు. అయితే విచారణ పేరుతో సీబీఐ తమను వేధిస్తోందని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని సునీల్‌ ఆ మధ్య హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం పులివెందులలో తమ నివాసానికి తాళం వేసి సునీల్ కుటుంబమంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సునీల్‌ గోవాలో ఉన్నట్లు తెలియడంతో సీబీఐ బృందం అక్కడకు వెళ్లి సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య దర్యాప్తును తలకెత్తుకున్న సీబీఐ కొన్నాళ్లు విచారణ జరిపి కరోనా కారణంగా ఆపేసి, రెండో దఫా దర్యాప్తుపే ప్రారంభించి, కడప కేంద్ర కారాగారం కేంద్రంగా 57 రోజులుగా విచారణ జరుపుతున్నది. అందులో భాగంగా పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా సునీల్ కుమార్ యాదవ్ ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. దీనిని అరెస్టుగా చూపుతారా లేదా అనేది ఇంకొద్ది గంటల్లో వెల్లడికానుంది.

సునీల్ కుమార్ యాదవ్ దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకాకు సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆయన హత్యకేసులో భాగంగా సీబీఐ అధికారులు సునీల్ కుమార్ యాదవ్‌తోపాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. అయితే ఇటీవలే వాచ్‌మెన్ రంగన్న సునీల్ కుమార్ యాదవ్ పేరు ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో సునీల్ కుమార్ యాదవ్ ముందస్తు బెయిల్‌కోసం హైకోర్టును ఆశ్రయించారు.

 

Related posts

మాజీ మంత్రి నారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మరదలు కృష్ణప్రియ!

Ram Narayana

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు!

Drukpadam

ఖమ్మం లాడ్జిలో ఎఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ ఆత్మహత్య!

Drukpadam

Leave a Comment