Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అత్యాచారం కేసు.. 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు…

అత్యాచారం కేసు.. 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు…
-మైనర్ బాలికపై అత్యాచారం చేసిన హోంగార్డు
-బాధితురాలి కుటుంబానికి రూ. 40 వేలు చెల్లించాలంటూ తీర్పు
-ఫిబ్రవరి 19న హోంగార్డును అరెస్ట్ చేసిన పోలీసులు

ఒకటి కాదు ,రెండు కాదు యావజ్జీవితం కాదు …. ఏకంగా 30 సంత్సరాల జైలు శిక్ష ….. ఇటీవల కాలంలో ఇంతటి శిక్ష విధించిన సందర్భాలు లేవని అంటున్నారు. న్యాయనిపుణులు , నిజంగా ఇది సంచలనమే …. ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులు హోమ్ గార్డ్ మల్లిఖార్జున్ అనే వ్యక్తికి 30 సంత్సరాల జైలు శిక్ష విధించడం సంచలనంగా మారింది.

లైంగిక దాడి కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన హోంగార్డ్ మల్లికార్జున్ కు నాంపల్లి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు బాధితురాలి కుటుంబానికి రూ. 40 వేలు చెల్లించాలని ఆదేశించింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే, హైదరాబాదులోని తుకారాంగేట్ వద్ద మైనర్ బాలికపై హోంగార్డు మల్లికార్జున్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిబ్రవరి 19న మల్లికార్జున్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాధితురాలు గర్భం దాల్చింది. అన్ని రిపోర్టులను పోలీసులు కోర్టులో సమర్పించారు. వీటిని పరిశీలించిన కోర్టు మల్లికార్జున్ కు 30 ఏళ్ల జైలు శిక్షతో పాటు, బాధితురాలి కుటుంబానికి రూ. 40 వేలు చెల్లించాలని ఆదేశించింది.

Related posts

ఉత్తరప్రదేశ్ లో జ‌ర్న‌లిస్టుపై ఐఏఎస్ అధికారి దాడి.. వీడియో వైర‌ల్!

Drukpadam

మధ్యప్రదేశ్ లో దారుణం..

Drukpadam

డబ్బుకు ఆశపడి వరంగల్ లో కొడుకును అమ్ముకున్న తండ్రి?

Drukpadam

Leave a Comment