జాతీయ వార్తలు

పంజాబ్ లో ఆలయ   నిర్మాణానికి స్థలాన్ని దానం చేసిన ముస్లిం..

జాతీయ సమైఖ్యత మరియు మత సామరస్యత కు ఉదాహరణ

పంజాబ్‌లోని మొహాలి జిల్లాలోని ఝాంపూర్ గ్రామంలో ఆలయ నిర్మాణం కోసం ముస్లిం కుటుంబం భూమిని విరాళంగా ఇచ్చింది

న్యూఢిల్లీ –పంజాబ్‌లోని మొహాలి జిల్లాలోని ఝాంపూర్ గ్రామంలో ఆలయ నిర్మాణం కోసం ఒక ముస్లిం కుటుంబం రూ. 80 లక్షల విలువైన 325 చదరపు గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది.

స్థానిక హిందూ నివాసితుల కొరకు మతపరమైన స్థలం అందుబాటులో లేనందువలన వారి అబ్యర్ధన మేరకు స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి 37 ఏళ్ల మొహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ హ్యాపీ మాలిక్ అధికారికంగా భూమి పత్రాలను ఆలయ కమిటీకి అందజేశారు. భూమిని దానం చేసిన ఇమ్రాన్, ఆలయ నిర్మాణ ఖర్చులను కూడా భరించాలని నిర్ణయించుకున్నాడు. ఇమ్రాన్ తన తల్లి, భార్య మరియు పిల్లలతో ఝాంపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు

ఝాంపూర్‌లో సనాతన ఆలయ నిర్మించడానికి భూమి కోసం పండిట్ రాజా రామ్, ఇమ్రాన్‌ను అభ్యర్థించారు. పండిట్ రాజా రామ్ కోరిక మేరకు ఇమ్రాన్ ఆలయ నిర్మాణానికి స్థలం తో పాటు ఆలయ నిర్మాణ ఖర్చులను కూడా భరించారు. పండిట్ రాజారామ్ ఇమ్రాన్‌ తో పాటు ఆలయ నిర్మాణానికి మద్దతుగా నిలిచిన ఝాంపూర్ గ్రామ నివాసితులకు కృతజ్ఞతలు తెలిపారు

ఈ హృదయపూర్వక చర్య పంజాబ్ యొక్క దీర్ఘకాల మత సామరస్యం యొక్క సంప్రదాయాన్ని హైలైట్ చేసింది,.

ఇమ్రాన్ గతం లో మసీదు, చర్చినిర్మాణం లో కూడా భాగస్వామి అయ్యారు. ఇమ్రాన్ స్నేహితుడు సంజయ్ జిందాల్ ఆలయ నిర్మాణ ప్రాజెక్టులో ఇమ్రాన్ కు సహకరిస్తారు. మూడు మార్లాల marlas,లో హనుమాన్ ఆలయం మరియు పది మార్లాల భూమిలో సనాతన ధర్మ ఆలయం నిర్మించబడతాయి.
మత సామరస్యం పరస్పరం మరియు స్థిరంగా ఉండాలని ఇమ్రాన్ అన్నారు. పంజాబ్ షాహి ఇమామ్‌ కూడా ఆలయ నిర్మాణ వేడుకలో పాల్గొన్నారు

ఇమ్రాన్ మరియు షాహి ఇమామ్‌లను హిందూ సమాజ ప్రతినిధులు, ఝాంపూర్ సర్పంచ్ పండిట్ రాజా రామ్ మరియు హర్‌ప్రీత్ సింగ్ గిల్, సనాతన ధర్మ సభకు చెందిన రూబీ సిద్ధు కలిసి సత్కరించారు.

పంజాబ్ లో ఇటువంటి సంఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి.ఇటివల పంజాబ్‌లోని జఖ్వాలి గ్రామంలోని 75 ఏళ్ల సిక్కు మహిళ కొత్త మసీదు కోసం భూమిని విరాళంగా ఇచ్చింది మరియు సిక్కు మరియు హిందూ కుటుంబాలు దాని నిర్మాణానికి ఆర్థికంగా సహకరిస్తున్నాయి.అనేక గ్రామాల్లోని సిక్కు నివాసితులు మసీదుల నిర్మాణం కోసం భూమిని బహుమతిగా ఇచ్చారు…

Related posts

బెంగళూరులో భారీ దోపిడీ.. నమ్మకంగా ఉంటూనే రూ. 18 కోట్లతో ఉడాయించిన నేపాలీ జంట

Ram Narayana

బంగ్లాదేశ్ ఎంపీ హత్యకేసులో వీడని మిస్టరీ..

Ram Narayana

ఢిల్లీ పేలుడు కేసు: పగలు డాక్టర్.. సాయంత్రం 4 తర్వాత టెర్రరిస్ట్..

Ram Narayana