Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మానుకోటలో రాళ్లు విసిరిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవా?: సీఎం కేసీఆర్​ పై ఈటల రాజేందర్​ హాట్ కామెంట్స్!

మానుకోటలో రాళ్లు విసిరిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవా?: సీఎం కేసీఆర్​ పై ఈటల రాజేందర్​ హాట్ కామెంట్స్
-ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కిస్తున్నారు
-ఉద్యమకారులంతా ఆలోచించుకోవాలి
-నన్ను ఓడించేందుకు ఇప్పటికే రూ.150 కోట్ల ఖర్చు
-మరో మూడు రోజుల్లో పాదయాత్ర మొదలుపెడతా
-హరీష్ రావు డ్రామాల మాటలు ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్న
-దళిత బందు రాష్ట్రమంతా వర్తింప చేయాలి
-ఎన్నికల షడ్యూల్ వచ్చే లోపే హుజురాబాద్ లో దళిత బందు అమలు జరగాలి
-నిరుద్యోగులకు ఎన్నికల వాగ్దానం మేరకు నిరుద్యోగభృతి ఇవ్వాలి

ఉద్యమకారులను వదిలేసి ఉద్యమద్రోహులను కేసీఆర్ అందలం ఎక్కిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. మానుకోటలో ఓదార్పు యాత్ర సమయంలో ఉద్యమకారులపైకి రాళ్లు విసిరిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవా…. ఉద్యమద్రోవులను అందలం ఎక్కించడమేనా నీనైజం …. తప్పు చేస్తున్నావ్ కేసీఆర్ … రాష్ట్ర ఏర్పాటుకోసం అనేక మంది ఆత్మ బలిదానం చేసుకున్నారని ఆ కుటంబాలను విస్మరించి ఉద్యమకారులపై రాళ్లదాడి చేసిన ద్రోహికి పదవి ఇవ్వడం అంటే కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు అర్థం చేసుకోవచ్చునని ధ్వజమెత్తారు దీనిపై ఉద్యమకారులంతా ఓ సారి ఆలోచించాలని ఈటల విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ డిశ్చార్జి అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైద్యులు తనకు మెరుగైన చికిత్స చేశారని చెప్పారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే సీఎం హామీల వర్షం గుప్పిస్తున్నారని ఆయన విమర్శించారు. దళితుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వడాన్ని తానూ స్వాగతిస్తున్నానని, అయితే రాష్ట్రంలో అందరికీ దానిని వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు.. గత ఎన్నికల్లోనూ తనను ఓడించేందుకు ప్రయత్నించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచేందుకు సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలను నమ్ముకున్నారని ఆరోపించారు. ఒక్కో నాయకుడికి ఖరీదు కట్టి కొనుగోళ్ల పర్వానికి తెరలేపారని రాజేందర్ ఆరోపించారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో రూ. 150 కోట్లను నగదు రూపంలో ఖర్చు చేశారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికతోనే కేసీఆర్‌కు హామీలు గుర్తొచ్చాయని, అందుకే తాయిలాలు ప్రకటిస్తున్నారని ఈటల మండిపడ్డారు. నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడేళ్లలో ఏనాడూ అంబేద్కర్‌కు కేసీఆర్ పూలదండవేయలేదన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్.. ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఆ తర్వాత తొలగించారని అన్నారు.

డ్రామాలు ఆడుతున్నారంటూ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తాను నాటకాలు ఆడేవాడిని కాదన్నారు. వైద్యుల సూచన మేరకు మరో రెండు మూడు రోజుల్లో ప్రజాదీవెన పాదయాత్రను మళ్లీ మొదలుపెడతానని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు దాన్ని వర్తింపజేయాలన్నారు. ఆర్థికంగా వెనకబడిన వాళ్లను కూడా ఆదుకోవాలని ఈ మాజీ మంత్రి డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి హామీ ఇచ్చి ఇంకా నెరవేర్చలేదన్నారు.

హరీశ్ రావు అన్నట్లుగా తాను ఆడేవాడిని కాదనే విషయం హరీష్ రావు కూడా తెలుసునని అన్నారు. హుజూరాబాద్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని ఈటల వ్యాఖ్యానించారు. తాను డ్రామాలు ఆడేవాడిని కాదని, సీరియస్ రాజకీయ నాయకుడినని అన్నారు. డ్రామాలు ఆడుతున్నానంటూ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. వైద్యలు సూచన మేరకు రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని ఈటల రాజేందర్ వెల్లడించారు. కాగా, దళిత బంధు పథకం హుజూరాబాద్ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రకటించారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈటలకు సన్నిహితులైన పలువురు నేతలు కూడా ఇటీవల టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామంటూ ప్రకటించారు. పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఇదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేతలను కేసీఆర్ కొంటున్నారని ఈటల ఆరోపిస్తున్నారు. భూ కబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో హుజూరాబాద్‌కు ఉపఎన్నిక జరగనుంది.

 

Related posts

ఖమ్మం లో బండి సంజయ్ హాట్ కామెంట్స్

Drukpadam

పార్టీ మారుతున్నారన్న వార్తలపై ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్…

Drukpadam

టీమిండియా చీఫ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పిన రవిశాస్త్రి..

Drukpadam

Leave a Comment