రాజకీయ వార్తలు

బలమైన దేశానికి బలహీన ప్రధాని… సిపిఐ నారాయణ..

బలమైన దేశానికి బలహీన ప్రధాని

యుద్ధ ప్రభావంతో ధరల పెరుగుదల

ముర్మువైకరి సమర్థనీయం కాదు

సి.పి.ఐ జాతీయనాయకులు నారాయణ

కమ్యూనిస్టులను బలహీనపర్చడమే వారిధ్యేయం కూనంనేని

12 మార్చి ఖమ్మం: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్యపునాధులున్న భారతదేశానికి మొడీ అత్యంత బలహీన ప్రధాని అని, యుద్ధాన్ని ఆపే కనీసం పనిచేయడం లేదని సి.పి.ఐ జాతీయ కంట్రోల్ కమీషన్ ఛైర్మెన్ డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు. ట్రంపుకు సాగిలపడటం తప్పా మోడీ మరేపని చేయలేక పోతున్నారని ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యంలో 5 శాతం కూడాలేదని ఆయన తెలిపారు, గురువారం స్థానిక గిరిప్రసాద్భవన్లో జరిగిన మీడీయా సమావేశంలోనారాయణ మాట్లాడుతూ భారతదేశంపై యుద్ధప్రభావం ప్రారంభమైందని గ్యాస్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయని ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యయసాయ ఉత్పత్తుల ధరలు కూడా పడిపోనున్నాయని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆర్థిక వనరులున్నదేశాలపై దాడులు చేసి ఆక్రమించే ప్రయత్నంచేస్తున్నారని వెనుజులా తరువాత ఇరాన్పై యుద్ధం చేస్తున్నాడని, క్యూబా పై కూడా దాడికి ప్రయత్నచేస్తున్నాడని తెలిపారు. ట్రంప్ను చూసి మోడీ బయపడుతున్నాడని 140 కోట్లమంది దేశప్రజల ఆత్మగౌరవాన్ని ట్రంప్ క్కుమోడీ తాకట్టుపెట్టారన్నారు. ట్రంపుకు వ్యతిరేకంగా మోడీ నోరువిప్పాలని మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితులు నెలకొంటున్నదశలో శాంతికి అలీనదేశంగా భారత్ గట్టి ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పతి ద్రౌపతిముర్మూవైకరి సమర్ధనీయం కాదని రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ఉన్నందుకు గర్వపడుతున్నాముకాని ఆదివాసీలకు నష్టం చేసే చర్యలు ప్రభుత్వానికి అనుమితులివ్వడాన్నిమాత్రం సమర్ధించబోమని ఆయన తెలిపారు, అటవీ హక్కుల చట్టాన్ని మార్చి అటవీ భూములను కార్పోరేట్కు అప్పగించే భాగంగానే ముర్ముకు రాష్ట్రపతి పదవిచ్చి అమెచేతనే ఆదివాసులకు నష్టం కలిగించే చర్యలకు బీజేపీ ఆమోదం తీసుకుంటుందన్నారు.

ఆపరేషన్ కగార్తో మావోయిస్టులను చంపి, అడవుల నుంచి ఆదివాసీలనుతరమి ఆభూములను కార్పోరేట్లకు కట్టబడెతున్నారని మావోయిస్టు నేతలను చంపిన ప్రతి సారి కార్పోరేట్లకు వేల ఎకరాలు స్వాధీనం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. వ్యక్తులుగా సహరించి తాత్కాలికంగా ఆనందం పొందవచ్చునేమోకాని సిద్దాంతాన్ని నశింపచేయలేరని అది ఎవరి తరంకాదని నారాయణ తెలిపారు. మావోయిస్టురహిత భారతదేశం కాదని పేదరిక రైతు భారతదేశంగా తయారు చేయాలని ఆయన అమీక్షకు సవాళ్ విసిరారు. ఖమ్మం వెలుగుమట్ల ఘటనపై స్పందిస్తూ భూస్వామ్యభూములను కమ్యూనిస్టులు ఆక్రమించే క్రమంలోనే భూదాన ఉ ద్యమం వచ్చిందన్నారు. ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణాలో లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. వెలుగుమట్లలో నివాసాలను కూల్చడం ఎందుకు తిరిగి అక్కడే పట్టాలివ్వడం ఎందుకని నారాయణ ప్రశ్నించారు. అక్కడ నివశించేదెవర్నా భారతీయులై కాబట్టి పేదలందరికీ పట్టాలు అందచేయాలని ఆయన డిమాండ్ చేశారు. అర్థంపరద్దం లేని చర్యలు రియల్టర్లకోసమే జరిగాయని ఇది దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

కమ్యూనిస్టులను బలహీనపర్చడమే వారిధ్యేయం కూనంనేని

కమ్యూనిస్టులను బలహీన పర్చడమే వారిధ్యేయమని అందుకే కమ్యూనిస్టులపై అనవసర విమర్శలు చేస్తున్నారని సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. మేము ఎలా పేనిచేయాలో మాకు తెలుసునని పేదల పక్షాన పనిచేయడమే మా కర్తవ్యమని విద్వేశంతో మాపై విమర్శలు చేయడం తగదన్నారు.

రాష్ట్రంలో 8 వేల మంది పేదలతో గుడిసెలు వేయించామని వాటికి పట్టాలివ్వాలని 58 జి.ఓ ద్వారా రెగ్యులర్ చేయాలని పోరాడుతున్నామన్నారు. నివాసస్థలాల పంపిని ఇళ్ళ నిర్మాణం ప్రభుత్వ బాధ్యతఅని అది బిక్షకాదని కూనంనేని తెలిపారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే లక్షల ఎకరాల భూపంపి జరిగిందని నిత్యం ప్రజల కోసమే మాపోరాటమని కుహానా వాదుల సూచనలు మాకు అవసరం లేదన్నారు, మావోయిస్టుల త్యాగాలను సి.పి.ఐ గుర్తించిందని, ప్రజా పోరాటాలకు కలిసిరావాలని కోరామన్నారు. వ్యక్తిగత అవసరాల కంటే ప్రజా సమస్యల పరిష్కారానికే సి.పి.ఐ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కమ్యూనిస్టుల అవసరం ఈ సమాజానికి ఉందని రానున్న కాలంలో మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. సి.పి.ఐ ప్రజా ప్రతినిధులకు ఈనెల 13,14 తేదీలలో రెండు రోజులపాటు పాల్వంచలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు కె.నారాయణ, పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ హాజరు కానున్నారని కూనంనేని తెలిపారు.

Related posts

కేంద్రాన్ని మళ్లీ టార్గెట్ చేసిన మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్!

Drukpadam

కుట్ర కోణం ఉందో, లేదో దర్యాప్తులో తేలుతుంది.. చీమలపాడు అగ్నిప్రమాద ఘటనపై కేటీఆర్…

Drukpadam

పవర్ షేరింగ్ ఫార్ములాను నేను బయటకు చెప్పను!: డీకే శివకుమార్…

Drukpadam