ఖమ్మం వార్తలు

జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలు పరిష్కరించండి…మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డికి వినతి

జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలు పరిష్కరించండి
-టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం

  • మంత్రి పొంగులేటి, సమాచార శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ

    జర్నలిస్టుల అక్రిడేషన్ మంజూరు విషయంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, అక్రిడేషన్ల జీవో లో ఉన్న ఇబ్బందులు సవరించాలని టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) జర్నలిస్టు యూనియన్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కి. శ్రీనివాస్ రెడ్డికి యూనియన్ నేతలు వినతి పత్రం అందజేసి సమస్యలు వివరించారు. శనివారం ఖమ్మం వచ్చిన మీడియా అకాడమీ చైర్మన్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే .రామనారాయణ తన నివాసంలో తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కు జర్నలిస్టులు, సంఘ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మైస పాపారావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మామిడాల భూపాల్, కార్యదర్శి పి.మహేందర్, జిల్లా కోశాధికారి నాగండ్ల శివానంద తదితరులు శ్రీనివాస్ రెడ్డి సమస్యలను వివరించారు. ప్రధానమైన 8 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి సమాచార శాఖ కమిషనర్ తో చర్చించి జర్నలిస్టులకు ఇబ్బందులు లేకుండా అక్రిడేషన్లు మంజూరు చేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఖమ్మం నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్, నంచర్ల జనార్ధన చారి, జిల్లా ఉపాధ్యక్షులు మొయినుద్దీన్, జిల్లా నాయకులు పసుపులేటి సత్యనారాయణ, ఏగినాటి మాధవరావు, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నామా పురుషోత్తం, వీడియో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు ఆలస్యం అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉపేందర్ రెడ్డి కన్నీళ్లకు కరిగితే ఐదు సంత్సరాలు కన్నీళ్లు పెట్టాల్సిందే…పొంగులేటి

Ram Narayana

సండ్ర విజయాన్ని కాంక్షిస్తూ కల్లూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ…

Ram Narayana

కమ్యూనిస్ట్ యోధుడు కామ్రేడ్ పోటు ప్రసాద్ కు కన్నీటి వీడ్కోలు!

Ram Narayana