ఖమ్మం వార్తలు

గాల్లో ప్రాణం అంటే ఇదేనేమో …గృహప్రవేశానికి వెళ్లిన మహిళ మృతి

నూతన గృహ ప్రవేశం …బంధువులు , స్నేహితులు చుట్టుపక్కల వారు వచ్చారు..గృహ ప్రవేశం అందరి సంతోషాల మధ్య జరిగింది …భోజనాలు కూడా అయ్యాయి .. కొందరు ఫోటోలు దిగుతున్నారు … కొంతమంది మహిళకు అక్కడ చేరి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫోటో దిగేందుకు నిలబడ్డారు ..అంతే అందులో బొమ్మ సుస్మిత తమ బంధువులతో కలసి ఫోటో దిగుతుండగా వెనక్కు ఒరుగుతుండగా గమనించిన తోటి మహిళలు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు ..అయిన కిందపడి పోయింది ..వెంటనే అక్కడ ఉన్నవారంతా పరుగుపరుగున వచ్చి ఆమెను హాస్పటల్ కు తరలించారు ..అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు …సంబరాల్లో మునిగిన బంధువులు ఈ వార్త విని షాక్ అయ్యారు …

గృహ ప్రవేశ వేడుకకు హాజరైన మహిళ ఆ ఇంటి వారితో ఫొటో దిగుతూనే కుప్పకూలిపోయింది. ఈ విషాద సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో జరిగింది. ఖమ్మంలోని త్రీటౌన్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల సుస్మిత తన బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లింది. కుటుంబ సభ్యులతో ఫొటో దిగేందుకు వేదిక వద్దకు చేరుకుంది.

వారికి శుభాకాంక్షలు చెప్పి, ఫొటో దిగుతుండగానే ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. పక్కన ఉన్న యువతి భుజంపై చేయి వేసి ఫొటో దిగుతుండగా ఈ ఘటన జరిగింది. పక్కనున్న వారు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె కొన్ని రోజులుగా గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Related posts

తుమ్మలను, నన్ను ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారు: పొంగులేటి ఆరోపణ..

Ram Narayana

డిసెంబరు 13 నుంచి భద్రాద్రిలో శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు

Ram Narayana

సాగర్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.

Ram Narayana