తెలంగాణ వార్తలు

మంత్రి దామోదర రాజనరసింహకు చేదు అనుభవం …

మంత్రి దామోదర రాజనర్సింహాకు చేదు అనుభవం ఎదురైంది. శాసన మండలి కొత్త భవనంలోకి వెళ్తున్న మంత్రిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు…

ఇది సీఎం వెళ్లే దారి అని మీరు వేరే వైపు నుండి వెళ్లాలని మంత్రికి సెక్యూరిటీ సిబ్బంది సూచించారు.

దీంతో ఎలా వెళ్ళాలి? నేను మినిస్టర్‍ను నన్ను ఆపుతావా అంటూ సెక్యూరిటీ సిబ్బందిపై దామోదర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండలి లోపలికి వెళ్లారు. మినిస్టర్‍తో పాటు ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ మండలి లోపలికి వెళ్లారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ…

కాగా శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభగా కొనసాగిన నిజాం కాలం నాటి ఈ భవనాన్ని ప్రభుత్వం రూ.30 కోట్ల ఖర్చుతో పునరుద్ధరించింది. ఇదిలా ఉంటే శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరిచారు. సీఎం రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

Ram Narayana

గద్వాల బీసీ హాస్టల్‌లో కలకలం.. 53 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలు…

Ram Narayana

కవిత విషయంలో కేసీఆర్ ప్లాన్ బెడిసి కొట్టిందా …?

Ram Narayana