ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబుకు భయపడొద్దు.. ఆ రోజులు పోయాయి: జగన్

వైసీపీ అధినేత జగన్ ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. పాలనలో అంతా తనదే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ప్రతి చిన్న విషయంలో ‘క్రెడిట్ చోరీ’ చేస్తున్నారని మండిపడ్డారు.

ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ మన హయాంలోనే రాష్ట్రానికి వచ్చిందని, కానీ ఇప్పుడు తన వల్లే వచ్చినట్టుగా చంద్రబాబు ‘బిల్డప్’ ఇస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. గూగుల్ విషయంలోనూ ఇదే జరిగిందని, మాటలు కోటలు దాటుతున్నా చేతల్లో ఏమీ లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో పార్టీని సరికొత్తగా తీర్చిదిద్దుతామని, ‘జగన్ 2.0’లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. నేతలెవరూ చంద్రబాబును చూసి భయపడాల్సిన అవసరం లేదని, ఆ రోజులు పోయాయని ధైర్యం చెప్పారు.

నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుండటం పార్టీకి మంచి పరిణామమని జగన్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని, గతంలో తాము పదవులు, కాంట్రాక్టుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు చట్టసభల్లో కూడా మన మహిళలకు మరిన్ని అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.

Related posts

విశాఖ, కడపలో స్థానిక సంస్థల రాజకీయ వేడి…!

Ram Narayana

వైసీపీలో చేరికపై వంగవీటి ఆశాలత క్లారిటీ…

Ram Narayana

వైసీపీ ఇన్చార్జిల మూడో జాబితా విడుదల… కేశినేని నానికి విజయవాడ బాధ్యతలు

Ram Narayana